Natyam ad

కడియపులంక ముసలమ్మ వారికి రూ.31.25 లక్షల నోట్లతో అలంకరణ

తూర్పుగోదావరి ముచ్చట్లు:

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా  మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ వారి ఆలయాన్ని రూ. 31 .25 లక్షల నోట్లతో అలంకరించారు. ప్రస్తుతం చాలామణిలో ఉన్న అన్ని రకాల కొత్త నోట్లను అంటే రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు వినియోగించి ఈ అలంకరణ అద్భుతంగా చేశారు.అలాగే బ్యాంకుల ద్వారా కొత్త నాణేలు కూడా తీసుకుని అలంకరించారు.మూడు రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేసారు. సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకలను ఈ ఆలయ కమిటీ వారు విన్నూత్న రీతిలో జరుపుతూ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకతను చాటుకుంటూ వార్తలకు ఎక్కుతారు. ఆ విధంగానే ఈ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణకు లక్షలాది రూపాయల నోట్లను వినియోగించడం అందర్నీ ఆకట్టుకుంటుంది.భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి నిత్య అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ, ధవళేశ్వరం శివాలయం అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేపట్టారు.

 

Post Midle

tags: Kadiyapulanka Musalamma was decorated with Rs.31.25 lakh notes

Post Midle