యదేఛ్చగా మూసి నది కబ్జా

Kafzah of the river closed forever

Kafzah of the river closed forever

Date:21/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల వేళ కబ్జాదారులకు వరంగా మారింది. అడ్డుకొనేవారు లేకపోవడంతో కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో కబ్జాదారులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా జోరుగా కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వశాఖల అధికారులు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో కబ్జాదారులకు సాకుగా మారింది. ఇంకేం యాధేచ్చగా కబ్జాలు చేస్తున్నా పట్టించుకొన్న నాథుడే కరువయ్యాడు.ఎవరైనా ఈ కబ్జాలపై అధికారులపై వత్తిడి చేస్తే కొందరు అధికారులు వచ్చి ఒకటి,రెండు రోజులు హడావిడిచేసి తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకొంటున్నారే తప్పా కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని పలువురు అధికారుల తీరుపై మండి పడుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన మూసీనది అస్థిత్వాన్ని కబ్జాదారులు కనుమరుగు చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడ ం లేదని ప్రశ్నిస్తున్నారు.రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్‌పూర్ మొదలు కొని బుద్వేల్, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్ ప్రాంతాల వరకు గల మూసీనదికి ఇరువైపులా  కబ్జాదారులు యాధేచ్చగా మట్టి, బండరాళ్లతో రాత్రి, పగలు అనేతేడా లేకుండా కబ్జాలు చేస్తున్నా పట్టించుకొనే వారే లేకపోవడం దారుణంగా ఉంది.
ప్రధానంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మూసీ నదిని కొందరు రాజకీయ పలుకుబడితో పాటు కొందరు అవినీతి అధికారుల కనుసన్నుల్లో ఈ కబ్జాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొందరు కబ్జాదారులు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే నిత్యం ఎక్కడో ఒకచోట లక్షలు, కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు నాలాలను కబ్జాలు చేయటం సర్వ సాధారణంగా మారిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. భూ కబ్జాలపై దినపత్రికలు, మీడియాల్లో వస్తున్నా అధికారులు ఆయా కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలోని అంతర్యా మేమిటనే అనుమానాలు కలుగుతున్నాయి.  రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాన్ని కొందరు యాధేచ్ఛగా మట్టి, బండరాళ్లతో డంప్‌చేసి కబ్జాచేస్తున్నా పట్టించుకొన్న నాథుడే కరువయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ మూసీ కబ్జాలపై స్థానికులు నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ, రెవిన్యూ విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోకపోవడంలోని అంతర్యామేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జోరుగా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, స్మశనవాటికల స్థలాలు కబ్జాలు చేస్తున్నా అధికారులు ఆయా కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలోని అంతర్యామేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.నియోజకవర్గంలోని కాటేదాన్, లక్ష్మీగూడ, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి సులేమాన్‌నగర్, ఉప్పర్‌పల్లి, చింతల్‌మెట్, అత్తాపూర్, హైదర్‌గూడ, నార్సింగ్, మంచిరేవుల తదితర బస్తీలు, గ్రామాల్లో కబ్జాదారులు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ కబ్జాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కబ్జాదారులపై భూ కబ్జాలు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Tags:Kafzah of the river closed forever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *