మోడ్రన్ సీతగా కాజల్

Kajal as Modren Seetha

Kajal as Modren Seetha

 Date:10/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు :
కాజల్‌ను ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేసి టాలీవుడ్ అందాల చందమామను చేసిన దర్శకుడు తేజ ఆమెను మోడ్రన్‌ ‘సీత’గా తీర్చిదిద్దుతున్నాడు. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీత’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. అమాయకుడైన రాముడు లాంటి హీరో (బెల్లంకొండ).. పొగరు కలిగిన మోడ్రన్ సీత లాంటి హీరోయిన్(కాజల్).. ఈ ఇద్దరి మధ్యలో రావణాసురుడు లాంటి ఓ విలన్ (సోనూ సూద్). ‘నీ కోసం సీత ఉంది.. సీత వచ్చి నిన్ను చూసుకుంటుంది. సీతను నవ్వు చూసుకోవాలి’ లాంటి ఫ్లాష్ బ్యాక్‌‌ని గుర్తు చేసే డైలాగ్‌ని ‘సీత’ కథ ఏంటో ఓ అవగాహనకు వచ్చేయొచ్చు. ఇక కంచులకే కంచులా.. ‘నా పేరు సీత.. నేను గీచిందే గీత.. రైమింగ్ బాగుంది కదా’.. అని తనను తాను పొగుడుకోవడంతోనే సీత క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. సీత.. నాకు టాయ్‌లెట్ కావాలని బాత్రూమ్ డోర్‌లు పగలగొట్టి మరీ సీతను హడలెత్తించే అమాయకు పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు బెల్లంకొండ. ‘నన్ను రావణాసురుడుతో పోల్చకండి రాముడ్ని నేను అంటూనే సీతను రా మంచం ఎక్కు అంటూ విలనిజాన్ని పండిస్తున్నాడు సోనూ సూద్.సీత ట్రైలర్‌ తేజ మార్క్‌లో ‘జయం’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలను గుర్తు చేస్తూ రొటీన్‌గానే ఉంది. అయితే ట్రైలర్ మొత్తంలో సీత క్యారెక్టరైజేషన్ కాస్త కొత్తగా అనిపించగా.. బెల్లంకొండ శ్రీనివాస్ అమాయకుడైన రాముడిగా నటించడానికి చాలా ఇబ్బందిపడుతున్నట్టుగా ఉన్నాడు. కణల్ కన్నన్ ఫైట్స్‌తో పాటు అనూప్ రూబెన్స్ సంగీతం ‘సీత’ చిత్రానికి ప్లస్ అయ్యేట్టు కనిపిస్తున్నాయి.
గుంటూరులో రాయపాటి ఫ్యామిలీ రాజకీయాలు
Tags:Kajal as Modren Seetha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *