పీఆర్సీపై కాకినాడ కలక్టరేట్ ముట్టడి
కాకినాడ ముచ్చట్లు:
ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అసంబద్ధ పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పలువురు ఉద్యోగులు, పెద్దఎత్తున ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరయ్యారు.సచివాలయం ఉద్యోగులు, సీఐటీయూ,ఏఐటీయూసీ తదితర ట్రేడ్ యూనియన్లు,ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు.ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని మండిపడ్డారు. పిఆర్సి విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న అన్యాయంపై ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈనిరసనలకు ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్లో ఉద్యోగులందరూ సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యాప్టో నేతలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి కుమార్, జిల్లా ఫ్యాప్టో అధ్యక్ష,కార్యదర్శులు చెవ్వూరి రవి, సెక్రటరీ బొజ్జాశరత్, కో చైర్మన్లు ఎస్. జ్యోతిబసు, నాగిరెడ్డి శివప్రసాద్, కె.సుబ్రహ్మణ్యం, టి.వెంకట్రావు, ఎస్టీయూ కోశాధికారి పి.సుబ్బరాజూ, యూటీఫ్ రాష్ట్రబాధ్యులు ప్రభాకరవర్మ , యూటీఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి, ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మోర్త శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మేడిశెట్టి కూర్మారావు,పిఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లంక జార్జ్, ఏపీటీఎఫ్ (257) జిల్లా అధ్యక్షులు ఫిలిప్ రాజు,సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ముని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Kakinada Collectorate siege on PRC