కాలభైరవ పల్లకి సేవ
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే కాలభైరవ పల్లకీ సేవ వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు,తేనె,విభూది, చందనం,కుంకుమ,నారికేల జలాలు,కందిపూడి,పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత కాలభైరవ స్వామివారికి వడమాల నిమ్మకాయల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభామయంగా అలంకరించి దీప దూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఆలయ సిబ్బంది మరియు స్థానిక భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హర…హర…మహాదేవ శంభో శంకర… ఓం… నమశివాయ నామస్మరణతో మార్మోగింది.
Tags: Kalabhairava Pallaki Seva