పుంగనూరులో కలామ్‌సైన్‌టిఫిక్ ఆప్టిట్యూడ్ పరీక్షలు
-రాష్ట్రవ్యాప్తంగా 4500 మంది హాజరు
పుంగనూరు ముచ్చట్లు:

ఈ.అబ్యాస్ అకాడమి హైదరాబాద్ వారిచే కలామ్‌సైన్‌టిౖఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్లెవల్-2 పరీక్షలు ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో విద్యార్థులు మానసిక ధృడత్వం పెంపొందించుకునేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతుందని చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 కేంద్రాలలో పరీక్షలకు 4500 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. విజేతలైన విద్యార్థులకు ఈనెల 23న గుంటూరులో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు ఉపాధ్యాయులు శ్రావణి, మోహన్‌కృష్ణ, సాదిక్ పాల్గొన్నారు.
Tags: KalamScientific Aptitude Tests in Punganur
