Natyam ad

యాదాద్రి జిల్లాకు కాలేశ్వరం నీరు విడుదల

భువనగిరిముచ్చట్లు:

 

 

రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ప్రభుత్వ విప్ సునీత లు శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు కాలేశ్వరం నీళ్లను విడుదల చేసారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని దామరకుంట వద్ద గోదావరి జలాలను ఎం. తుర్కపల్లి ప్రధాన కాల్వ క్రాస్ రెగ్యులేటర్ దవారా విడుదల చేసారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే బస్వాపూర్ (నృసింహ సాగర్) రిజర్వాయర్ ద్వారా యాదగిరిగుట్ట క్షేత్రానికి గోదావరి జలాలు చేరుకోగా, ఇక ఆలేరు నియోజకవర్గంలోని భూములను తడిపేందుకు పరుగులు పెడుతూ వస్తున్నాయి. 2020 సంవత్సరంలోనే కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సాగు నీరు మొదలవగా, తాజాగా మన్నెవారి తుర్కపల్లి ప్రధాన కాల్వ సైతం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట రెగ్యులేటర్ వద్ద శుక్రవారం ఈ కాల్వలోకి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి నీటిని విడుదల చేసారు.  దీని ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో 868 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. 20 చెరువులను నింపనున్నది.

Post Midle

Tags:Kaleshwaram water released to Yadadri district

Post Midle