కాళేశ్వరం ప్రాజెక్టు పనులు భేష్

Date:19/01/2021

కరీంనగర్ ముచ్చట్లు:

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చివేసిందని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన స్పూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తూపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణాలు శరవేగంగా జరగుతున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీంటిని త్వరితిగతిన పూర్తి చేసి రైతుల సాగునీట గోసను శాశ్వతంగా రూపుమాపాల‌న్న‌ది త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టిన‌ట్లు తెలిపారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో కూడా వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమై 365 రోజులు పనిచేసిన‌ట్లు చెప్పారు. భూసేకరణతో పాటు వివిధ క్రాసింగ్ లకు సంబంధించిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్ధంవంతంగా పరిష్కరించార‌ని కొనియాడారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉంద‌న్నారు. మేడిగడ్డ బ్యారేజీ, తుపాకుల గుడెం బ్యారేజి, దుమ్ముగూడెం బ్యారేజీల వల్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని.. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్  రూపొందించాలని..

 

 

 

సమయానుగుణంగా రూల్స్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని సీఎం సందర్శించారు. సతీమణి శోభ, మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడ నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంలో కృషి చేసిన నీటిపారుదల శాఖాదికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తి స్థాయిలో నీరు నిలువ ఉందని, ఈ ఎండాకాలం అంతా ఈ నీటితో  రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్పూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను సీఎం గుర్తుచేసుకున్నారు.

 

 

 

సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోసను అనుభవించిందని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేందుకు అవసరమైన సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్న‌ట్లు తెలిపారు. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తరువాత బ్యారేజీ నిర్మాణం చేపడితే ఎక్కువ కాలం పాటు కావలసినంత నీళ్లు పంపింగ్ చేయవచ్చని వ్యూహం రూపొందించామ‌న్నారు. వ్యాప్కోస్ తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. 16.17 టీఎంసీల నీటి నిలువ సామర్ద్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల దాదాపు 7 నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చని అంచనా వేసిన‌ట్లు తెలిపారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నది.

 

 

 

99.7 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీరు నిలువ ఉంద‌న్నారు. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిన‌ట్లు వెల్ల‌డించారు. నీటి పంపింగ్ కూడా  ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంద‌న్నారు. మెడిగడ్డ పాయింట్ నుండి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిలువ ఉండడంతో జలకళ ఉట్టి పడుతోంద‌న్నారు. బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి.  ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఎల్ఎండి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ప్రతీ ఏటా నీరందుతుంద‌ని చెప్పారు. నిజాంసాగర్‌కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు  జరుగుతున్నాయి. అవసరమైన పక్షంలో ఎస్ఆర్ఎస్పీకి కూడా ఈ ప్రాజెక్టు నుండే నీటి పంపింగ్  చేయడానికి  ఏర్పాట్లు చేయడం జరిగింద‌న్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: Kaleswaram project works bhesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *