నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కల్పనా కుమారి

Date:11/08/2020

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల రెవెన్యూ డివిజన్ ఆఫీసు యందు మంగళవారం నాడు సబ్ కలెక్టర్  (ఆర్డీవో) గా కల్పనా కుమారి బాధ్యతలు చేపట్టారు . గతంలో పనిచేసిన ఆర్డీవో రామకృష్ణారెడ్డి. నంద్యాల తాహశీల్దారు రవికుమార్ తో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు ఆర్డీవో గారికి స్వాగతం పలికారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 2018 ఐఏఎస్ బ్యాచ్ అధికారిని . ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. నంద్యాల డివిజన్ లో రెవెన్యూ సిబ్బంది పూర్తి సహయ సహకారాలు అందించాలని అన్నారు . అందరం కలిసి కట్టుగా విధులు నిర్వహించి నంద్యాల డివిజన్ ను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామన్నారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి నుంచి సబ్ కలెక్టర్ గా చార్జీ తీసుకున్నాని అన్నారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న దుకాణాల లైసెన్స్ లు రద్దు

Tags:Kalpana Kumari, who took over as Nandyala sub-collector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *