కల్తీ ఇంజన్ అయిల్ గుట్టు రట్టు

సూర్యాపేట ముచ్చట్లు:


తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కల్తీ ఇంజన్ ఆయిల్ ముఠా పేట్రేగిపోతోంది. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న ముఠా ఆట కట్టు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసు. పేరొందిన బైకు, కార్లు, ఇతర వాహనాలు సంబంధించి ఇంజన్ ఆయిల్ బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించి.. కల్తీ ఆయిల్ అంటగట్టి సొమ్ము చేసుకుంటుంది ముఠా. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ, మిర్యాలగూడ వంటి ప్రాంతాలతో పాటు విజయవాడ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఈ కల్తీ ఆయిల్ రీసైక్లింగ్ చేసి అవుతున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఆయా వాహనాలకు సంబంధించి.. ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఆ పాత ఆయిల్ని రీసైక్లింగ్ చేసి తిరిగి కొత్త డబ్బాలో స్టిక్కరింగ్ చేసి బైక్ కారు ఇతర వాహనాల షెడ్డు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో 300 నుంచి 400 రూపాయలు ఒక లీటర్ ఆయిల్ ధర పలుకుతుండగా ఈ కల్తీ ఆయిల్ ని కేవలం 150 రూపాయలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్యాపేట పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్న ఉన్నట్లు సమాచారం వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Tags: Kalti Engine Oil Guttu Rattu

Post Midle
Post Midle
Natyam ad