Natyam ad

పేద‌ల‌కు క‌ళ్యాణల‌క్ష్మీ వ‌రం-ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ ముచ్చట్లు:

కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని దేవరకొండ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలానికి చెందిన 140మందికి రూ.1.40కోట్లు కల్యాణ లక్ష్మీ చెక్కులను, చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణ లక్ష్మీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా, ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు.

 

 

Post Midle

ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా రూ.1,00,116లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని, కేవలం బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసే వరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారన్నారు. ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్, చింతపల్లి జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్ రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్ రావు, దళిత బంధు జిల్లా సభ్యులు మాస భాస్కర్, వింజమురి రవి, ఎంపీటీసీ స్వతాకుంభం శ్రీశైలం, దండెకార్ లలితమోహన్, ఉడత అక్రమ్ యాదవ్, కొండూరు శ్రీనివాస్, పొగాకు శ్రీశైలం, బాదేపల్లి పులిరాజు గౌడ్, బోడ్డుపల్లి కృష్ణ, శిమర్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Kalyan Lakshmi Varam for the poor – MLA Ravindra Kumar

Post Midle