ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మీ

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శం
జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత,ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం ఆని ,ఆడబిడ్డలకు అండగా కల్యాణ లక్ష్మీ పథకం ఆని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత,జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ఆన్నారు.శుక్రవారం జగిత్యాల రూరల్  మరియు అర్బన్ మండలాలకు చెందిన 99 మంది లబ్ధిదారులకు దాదాపు 1కోటి  రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మీ చెక్కులను మరియు 63 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమం రెండు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకి నడిపిస్తున్నారని ,సీఎంఆర్ఎఫ్ ,కల్యాణ లక్ష్మీ పథకాలను ప్రవేశ పెట్టి రాష్ట్రంలోని నిరుపేదలకు  ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీపథకం చాలా గొప్ప పథకం ఆని   దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్నారని ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి  కట్టుబడి ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల ,మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారని, మహిళలు ఆర్థికంగా సాధికారతను సాధించినప్పుడే  కుటుంబం ,రాష్ట్రం మరియు దేశం బాగుంటుందని నమ్మి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.ఆడపిల్ల పెళ్లి అంటే తల్లి తండ్రులకు ఆర్థిక భారం ఉండేదని కానీ కేసీఆర్ ఈ పథకం వల్ల భారం తగ్గిందని,కుల మత ప్రస్తావన లేకుండా అందరికీ ఈ పథకం అమ్మాయి తల్లిదండ్రులకు ఒక భరోసాగా ఉందని అన్నారు.పిల్లల పాఠశాల విద్య నుండి పెళ్లి వరకు ప్రతి దాంట్లో లబ్ది చేకూరుస్తూ దేశంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.రైతులకు, ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తూర్పు నుండి పడమరకు నీరు మల్లిస్తున్నారని ఇది దేశంలోనే చాలా గొప్ప ప్రాజెక్టు అని అన్నారు.జగిత్యాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని మెడికల్ కాలేజీని మంజూరు చేశారని రాబోయే రోజుల్లో బీద,మధ్య తరగతుల వారికి నాణ్యమైన వైద్య సదుపాయాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రురల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, పాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి,సందీప్ రావు,రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు,జిల్లా రైతు బందు మెంబెర్ బాల ముకుందం,అర్బన్ మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, సర్పంచ్లు,ఎంపీటీసీలు,ఉప సర్పంచులు, ఏఎంసీ ,పీఏసీఎస్ డైరెక్టర్లు,రైతు బంధు సమితి నాయకులు,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Kalyana Lakshmi Andaga for girls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *