పేదింటి అడబిడ్డలకు గొప్ప వరం కళ్యాణలక్ష్మి పథకం

Date:27/08/2020

– ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని 127 మంది కల్యాణ లక్ష్మీ- షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులను తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ పంపిణీ చేశారు.   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ పథకం పేదింటి అడ పిల్లలకు గొప్ప వరం లాంటిదని అయన అన్నారు.  మండల కేంద్రంలో ఇటీవల కళ్యాణలక్ష్మి పథకాన్ని దరఖాస్తు చేసుకున్న 127 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.  పేద ఆడపిల్లలకు విహవా సమయంలో  తల్లిదండ్రులకు భారంగా భావించి పుట్టిన అడపిల్లలను అమ్ముకునే  సాంప్రదాయం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి అన్ని వర్గాల వారికి  లక్షా నూట పదహార్లు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుండి మంజూరు అయిన చెక్కులను పంపిణీ చేసి టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని తెలిపారు. మన గురించి ఆలోచించే సీఎం కేసీఆర్  పది కాలాల పాటు బాగుండాలని మనమందరం కోరుకోవాలి.  చెక్కులను అందుకున్న తల్లులకు,అక్కచెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్యే  రజాక్, జెడ్పీటీసీ కన్నా సూరంభ వీరన్న, వైస్ ఎంపీపీ శ్రీరాం రెడ్డి, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్‌తో మరణించిన వారికి అంత్యక్రియలు

Tags:Kalyana Lakshmi scheme is a great boon for poor children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *