పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కళ్యాణ లక్ష్మీ పథకం

Date:23/09/2020

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్

పర్వతగిరి ముచ్చట్లు

పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్ధికంగా అండగా నిలబడి తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెళ్లి భారాన్ని దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ పథకమని ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.బుధవారం మండల కేంద్రంలోని జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 82మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 81లక్షల 10వేల 396రూపాయలు విలువగల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల‌ పుడితే బాధపడే రోజులు పోయాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిరంతరం ప్రజా సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.దేశంలోనే నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ,ఎస్టీ,బిసి,షాధీముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహాల కోసం లక్ష రూపాయలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆరెఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయలేదని,కేవలం కెసిఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి లునావత్ కమల పంతులు,జడ్పిటిసి బానోత్ సింగూలాల్,జడ్పి కో ఆప్షన్ మెంబర్ ఎండి సర్వర్,మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్,పిఎసిఎస్ చైర్మన్లు, ఎఎంసీ డైరెక్టర్లు,తహసీల్దార్,మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

మల్లీశ్వరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎరుకల సామాజిక వర్గాన్ని గౌరవించాలి

Tags:Kalyana Lakshmi scheme of financial security for the marriage of poor girls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *