కల్యాణలక్ష్మీ,షాది ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:


కల్యాణలక్ష్మీ ,షాది ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటిదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్ లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 93 మంది ఆడబిడ్డలకు 93 లక్షల 10వేల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మీ చెక్కులను  జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ లబ్దిదారులకు సోమవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, జిల్లా రైతు బందు సమితి నాయకులు బాల ముకుందం,సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్,సర్పంచులు నాడేం శంకర్,గంగనర్సు రాజన్న,దామోదర్,రాజేశ్వర్ రెడ్డి,మహేశ్వర రావు,అరుణ అంజన్న,అంజయ్య,ఎంపీటీసీ లు పరశురామ్ గౌడ్,సురేందర్ రెడ్డి,
సౌజన్య తిరుపతిరెడ్డి, రత్న,సునీత లక్ష్మణ్,సింగిల్ విండో వైస్ చైర్మన్ సురేందర్,ఉప సర్పంచ్ గంగాధర్,ఎమ్మార్వో నవీన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Kalyana Lakshmi, Shadi Mubarak a boon for poor girls – MLA Dr Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.