కమల్ కూడా నో చెప్పేశాడు

Date:15/02/2018
చెన్నై ముచ్చట్లు:
దక్షిణాదిన మరో స్టార్ హీరో సినిమాలకు సెలవ్ ప్రకటించేశాడు. ఇక సినిమాలు చేయను అని ఆయన స్పష్టం చేశాడు. ఇప్పటికే తెలుగు హీరో పవన్ కల్యాణ్, తమిళ నటుడు రజనీకాంత్ లు సినిమాల విషయంలో.. చేయం.. అని ప్రకటించేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తను ఇక సినిమాలు చేయను అని ఆయన ఇటీవల అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించాడు.ఇక రోబో 2, కాలా ల తర్వాత సినిమాల విషయంలో రజనీకాంత్ కూడా అనాసక్తినే కనబరుస్తున్నాడు. చేయడానికి రజనీ ముందుకు వచ్చేలా లేడు. అయితే సినిమాలు చేయాలా, వద్దా అనే విషయంపై కూడా దేవుడు ఆదేశించాలని రజనీ అభిమానులతో సమావేశంలో వ్యాఖ్యానించాడు. అయితే ఆయన కొత్తగా సినిమాలు మాత్రం ఒప్పుకోవడం లేదు.ఇక ఇప్పుడు కమల్ హాసన్ కూడా అదే మాటే చెప్పాడు. తను ఇక సినిమాలు చేయను అని కమల్ అంటున్నాడు. ‘నేను నటుడిగా మరణించాలని అనుకోవడం లేదు, ప్రజా సేవకుడిగా మరణించాలని అనుకుంటున్నా..’ అనే ప్రకటనతో సినిమాలకు గుడ్ బై చెప్పాడు కమల్. ప్రస్తుతం కమల్ సినిమాలు రెండు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి విశ్వరూపం-2 కాగా మరోటి త్రిభాష చిత్రం ‘శభాష్ నాయుడు’. ఈ రెండు సినిమాలూ విడుదల కావాల్సి ఉంది.ఈ హీరోలు ముగ్గురూ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పారని వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమా హీరోలంతా తెరకు గుడ్ బై అనే అంటూ ఉంటారు. అయితే కొందరు హీరోలు రాజకీయాల్లో అనుకున్న పదవులు సాధించలేక తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. మరి పవన్, రజనీ, కమల్ ల కథ ఎలా ఉంటుందో చూడాలి!
Tags; Kamal also said no

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *