డిఫరెంట్ ఇమేజ్ తో కమల్ అడుగులు

Date:22/02/2018
చెన్నై ముచ్చట్లు:
తమిళనాడులో పాజిటివ్ పొలిటికల్ వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న హీరో కమల్ హాసన్ ను చూసి అయినా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అభిమానులు అంటున్నారు. చంద్రబాబును విమర్శించే ప్రత్యర్థులు, ప్రధానంగా.. ఆయనను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే భాజపా దళాలకు వారు ఈ మేరకు బుద్ధి చెబుతున్నారు.కమల్ హాసన్ తమిళనాడులో తాను పార్టీ పెట్టదలచుకున్నప్పటినుంచి ఒక డిఫరెంట్ ఇమేజితోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆయన పార్టీ జయాపజయాలు ఎలా ఉంటాయనే సంగతి పక్కన పెడితే.. ఒక నిష్కల్మషమైన ఎప్రోచ్ తో రాజకీయాలు చేస్తాయని మాత్రం అందరూ నమ్ముతున్నారు. పైగా పార్టీ ప్రకటించిన నాటినుంచి కమల్ దేశంలో పలువురు రాజకీయ ప్రముఖుల్ని కలిశారు. సలహాలు తీసుకున్నారు. అలాంటి వారిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, వామపక్ష నేతలు, ఆప్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు ఉన్నారు.వామపక్షాలు, మమతా పరస్పర శత్రువులైనా.. రాజకీయ సిద్ధాంతాల బలం ఉన్న ఇరుపక్షాలను కమల్ కలిసి తన ప్రస్థానం గురించి వివరించి.. రావడం విశేషం. ఇన్ని రకాలుగా కసరత్తు చేస్తున్న కమల్ హాసన్ తనంత తాను స్వయంగా చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి.. ఆయన సలహాలు , సూచనలు తీసుకోవడం అనేది కీలకమైన విషయం. కేవలం అదొక్కటే కాదు.. ఇన్ని రోజులుగా దేశంలో ఇందరు నాయకులను కలుస్తూ.. దేశంలో రాజకీయ నాయకుల తీరు తెన్నులను గమనిస్తూ వస్తున్న కమల్ హాసన్, ఏకంగా చంద్రబాబునాయుడు నా హీరో అంటూ ప్రకటించడం గమనించాల్సిన విషయం. అదేమీ చంద్రబాబు సత్కార వేదిక కాదు. ఆయనకు సంబంధం కూడా లేదు. ఎక్కడో రామేశ్వరం లో సాధారణ ప్రసంగం చేస్తూ.. చంద్రబాబుతో ఫోనులో మాట్లాడిన అంశాన్నికూడా చెప్పాల్సిన అవసరం లేని చోట.. మహాత్ముడి తర్వాత ఏకంగా చంద్రబాబు పేరు మాత్రమే ప్రస్తావించి.. తన దృష్టిలో ఆయన హీరో అన్నాడంటే.. ఆయన విలువను అందరూ అర్థం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ప్రజలకు ఎలా మంచి చేయాలనే విషయంలో చంద్రబాబు చెప్పిన సంగతులు కమల్ ను అంతగా ఇంప్రెస్ చేశాయని కూడా మనం తెలుసుకోవాలి.
Tags: Kamal steps with different image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *