కింగ్ మేకర్ కావాలనే యోచనలో కమల నేతలు

Kamala leaders in the thought of becoming King Maker

Kamala leaders in the thought of becoming King Maker

Date:09/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో రాజకీయ పార్టీలు బరిలో నిలిచి అధికారం దక్కించుకునేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.తెలంగాణలో కింగ్‌ మేకర్‌ కావాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, మహాకూటమిల మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న కమల దళం.. టీఆర్‌ఎ్‌సకు మెజారిటీ తగ్గితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని యోచిస్తోంది.ఆ దిశగా దూకుడు పెంచింది. వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి దేశం నలుమూలల నుంచి నేతలను రప్పించాలని నిర్ణయించింది! అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. 30 సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. కచ్చితంగా 15 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల వ్యూహాల అమలుకు పార్టీ, సంఘ్‌ పరివార్‌ ఉమ్మడి కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నాయి.
అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నెల క్రితమే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుంది. 14 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్దులను ప్రకటించలేదు. అక్కడ ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను చేర్చుకుని గెలుపుపొందేందుకు ప్లాన్ చేస్తుంది. బీజేపీలో 119 నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు దొరక్క పోవడంతో ఆ పార్టీ అధినేతలు ఇతర పార్టీల నుంచి వచ్చే వారికోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. వచ్చే వారిలో బలమైన వారుంటే టికెట్లిచ్చి గెలిపించుకోవాలని ఢిల్లీ అధినేతలు రాష్ట్ర నాయుకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ తమతో కలిసొచ్చే పార్టీలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తలపడేందుకు శక్తులన్నిటినీ కూడగట్టుకుంటోంది.
నాలుగు పార్టీలు ఏకం కావడంతో సీట్ల పంపకంపై కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఈపారీల్లో ఆశావాహులు ఎక్కువమంది ఉన్నారు. వారందరికీ టికెట్లు రావాలంటే సాధ్యంకాని పని అందుకు కొంతమంది త్యాగం చేయాలని పార్టీ పెద్దలు సూచించారు. దీంతో కొంతమంది టీఆర్‌ఎస్ గూటికి చేరారు. సీట్లు ప్రకటిస్తే ఇంకా చాలామంది బయటపడే అవకాశం కనిపిస్తుంది. వారంరోజుల్లో కూటమి నాయకులు  సీట్ల జాబితా ప్రకటించనున్నారు. తరువాత జంప్ జిలానీలు దూకుడు పెంచుతారు. అధికార పార్టీలో చేరితే బెర్తు దొరకడం కష్టమైన పనే. అందుకని ఖచ్చితంగా పోటీ చేయాలనుకునే అభ్యర్దులకు సూటిగా కనిపించేది భారతీయ జనతాపార్టీ.
పైగా ఇప్పటివరకు ఆ పార్టీలో అభ్యర్దుల ఖరారు పూర్తికాలేదు. నగరంలోని ఐదు సిట్టింగ్ స్దానాలతో పాటు సూర్యాపేట, కల్వకుర్తి, ఆదిలాబాద్, అలేరు, భువనగిరి, జనగాం, నారాయణపేట, షాద్‌నగర్, మెదక్, ఆందోల్, పరకాల, నిజామాబాద్ అర్భన్, కరీంనగర్, వేములవాడ, ఖమ్మం, పాలేరు,మునుగోడు వంటి నియోజకవర్గాలకు పెద్దగా పోటీ లేకపోవడంతో అక్కడ అభ్యర్దులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇంకా దాదాపు 100 నియోజకవర్గాలకు అభ్యర్దులు వెతికే పనిలో కమలనా థులు పడినట్లు సమాచారం. బలమైన నాయకుల కోసం దేవులాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో నుంచే 15 నుంచి 18 మంది నాయకులు కూటమిలో దొరకకుంటే బీజేపీలో దూకేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపి కూడా పొత్తులో భాగంగా 12 సీట్లు రావచ్చని, ఈ సారి పోటీ చేయకపోతే రాజకీయ ఉనికి కోల్పోతామనుకునే మిగతా నాయకులు కాషాయం వైపు చూస్తున్నారు.
గడి చిన ఎన్నికల్లో కమలనాథులతో కలిసి పనిచేసినవారే, పా తపరిచయాలు ఉండటంతో అటువైపు వెళ్లేందుకు ప్రయ త్నాలు సాగిస్తున్నారు. టీజెఎస్ 24స్దానాల్లో పోటీ చేయా లని ముందుగా భావించి పొత్తు ఉన్నందువల్ల 10 సీట్లు రావచ్చని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. మిగతా 14మంది తమ పరిస్దితి ఏమిటని మథనపడుతూ కార్యకర్తల్లో నిరుత్సాహం తగ్గకుండా ఉండేందుకు బీజేపీ నేతలలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అందుకో సం త్వరగా సీట్ల విషయంలో తేల్చాలని హైకమాండ్‌ను కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ వరకు నాన్చి తీరా  ఆశావాహులు ఎక్కడకీ పోకుండా చూసుకోవాలనే ఆలోచనతో పార్టీలుంటే తాము కూడా తగిన అవకాశం కోసం చూస్తున్నామని నాయకులంటున్నారు. కమలం గూటికి చేరుతామని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన నాయకులు పేర్కొంటున్నారు.
టీఆర్‌ఎస్‌లో ప్రకటించిన సీట్లలో సిట్టింగ్ స్దానంలో ఆందోల్‌కు చెందిన బాబు మెహన్‌కు సీటు దక్కలేదు. దీంతో ఆయన కమలం గూటికి చేరారు. పెండింగ్ సీట్లపై ఇప్పటివరకూ స్పష్టత రాకపోవడంతో వాటిని ఆశించేవారి జాబితా ఎక్కువగానే ఉంది. ఆసీట్లపై ప్రకటన రాగానే సుమారు 8మంది నాయకులు బీజేపీ తీర్ధ్దం పుచ్చుకుంటారని వారి అనుచ రులు అంతర్గత సంబాషణలో వెల్లడిస్తున్నారు. కూటమి అభ్యర్దుల జాబితా విడుదలైతే 36మంది నాయకులు పార్టీ మారడం ఖాయమని తెలుస్తుంది. కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు కూడా ఇతర పార్టీలా మాదిరిగా తొందర వద్దని, ఎన్నికలకు సమయం ఉంది, రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ ఏర్పడే వాతావరణమందంటున్నారు.
టీఆర్‌ఎస్, మహాకూటమి, బిఎల్‌ఎఫ్ అభ్యర్దులు బరిలో నిలుస్తుండంటంతో తమ పార్టీకి అనుకూల వాతావరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు స్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఐదారు స్థానాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార టీఆర్‌ఎస్ తో పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో సులువుగా వీటిని గెలవచ్చని అంచనా. అయితే బీజేపీ ఎత్తుగడ మరోలా ఉంది. ఐబీ ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న బీజేపీ.. తెలంగాణలో పార్టీ విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించుకుంది. రాష్ట్రంలో ఏకపక్షంగా ఫలితాలు ఉండే అవకాశం లేదని.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉందని ఐబీ అంతర్గత నివేదికను ప్రధాని కార్యాలయానికి అందించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
Tags:Kamala leaders in the thought of becoming King Maker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *