Natyam ad

కమలం గూటికి.. ములాయం చిన్నకోడలు

లక్నో ముచ్చట్లు:
 
ములాయం సింగ్ యాదవ్  కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపర్ణా యాదవ్‌కు పార్టీ కండవ కప్పి ఆహానించారు. ఆ తర్వాత అపర్ణా యాదవ్ మాట్లాడుతూ.. తాను ముందు నుంచి బీజేపీభావజాలానికి ప్రభావితురాలినని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సహా ఆఫీస్‌ బేరర్‌లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు యాదవ్‌. నా సామర్థ్యం ప్రకారం ఏ పని ఇచ్చినా చేసినా చేస్తాను అంటూ పేర్కొన్నారు.అనంతరం డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ తన సొంత ఇంట్లో విఫలయ్యారని విమర్శించారు. ఇంతకు మించి ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ మా పథకాలన్నింటిని క్రెడిట్‌గా తీసుకునేందుకు ప్రయత్నించిందని అన్నారు. అభివృద్ధి చేశానని అఖిలేష్ యాదవ్ అన్నారు. వాళ్లు ఇంత డెవలప్ చేసి ఉంటే.. వాళ్లకు సేఫ్ సీటు దొరక్క ఇంత సమయం ఎందుకు పడుతోందంటూ ప్రశ్నిచారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా ఇంత సమయం తీసుకుంటున్నారని ప్రశ్నించారు.స్వామి ప్రసాద్ మౌర్య సహా డజనుకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన తర్వాత బీజేపీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ములాయం కుటుంబంలో ఇప్పుడు బీజేపీ చీలిక తెచ్చింది. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల వ్యవహారశైలికి ప్రభావితమై చాలా మంది బీజేపీలో చేరాలనుకుంటున్నారని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అన్నారు. ఈ క్రమంలో అపర్ణా యాదవ్ కూడా బీజేపీలో చేరారుములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్. అపర్ణ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై లక్నో కాంట్ నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Kamalam Gooti .. Mulayam Chinnakodalu

Leave A Reply

Your email address will not be published.