చలో “గుంజపడుగు” తరలివెళ్లిన కామారెడ్డి న్యాయవాదులు

Date:23/02/2021

కామారెడ్డి  ముచ్చట్లు:

మంథని లో హైకోర్టు న్యాయవాద దంపతులు వమనరావు, నాగమణి ల హత్య కు నిరసనగా ఆందోళన నిర్వహించడానికి , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలియజేయడానికి కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం వమనరావు స్వగ్రామమైన గుంజపడుగు తరలివెళ్లారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల హత్య పై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని,  వారి కుటుంబానికి ఐదు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని, హత్య తో సంబంధo ఉన్న అసలు సూత్రదారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయవాదుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అడ్వొకేట్ ప్రోటాక్షన్ యాక్ట్ తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మన్ రావు, సురేందర్ రెడ్డి, ఉపాద్యక్షుడు అతిమాముల శ్రీధర్ ప్రతినిధులు నర్సింహారెడ్డి, జగన్నాథం, శంకర్ రెడ్డి,వెంకట్రాంరెడ్డి,చంద్రశేఖర్, దామోదర్ రెడీ,మహబూబ్ అలీ, దేవరాజ్ గౌడ్.అమృత్ రావు, చింతల గోపి,గోవింద్ రావు,భిక్షపతి, శ్రీకాంత్ గౌడ్,బి.నారాయణ,సలీo,గంగాధర్, జి.శ్రీనివాస్, కె.శ్రీనివాస్,మాక్సుద్, మోహన్ రెడ్డి, గంగరాజ్, స్టీఫెన్ రాజ్, అంగ్ రాజ్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Kamareddy’s lawyers who moved to “Gunjapadugu” in Chalo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *