కామినేని ఇప్పుడు కిం కర్తవ్యం

Kaminine is now kim

Kaminine is now kim

Date:13/04/2018
విజయవాడ ముచ్చట్లు:
బీజేపీకి టీడీపీకి మధ్య జరుగుతున్న గొడవ కారణంగా అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. టీడీపీ, చంద్రబాబుపై ఆయనకు ఎంతో అభిమానం ఉండటమే ఇందుకు అసలు కారణం. బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కామినేనికి ఎవరూ ఊహించని విధంగా కీలకమైన వైద్య, ఆరోగ్యశాఖ లభించింది. మంత్రి పదవి నిర్వహణలో ఆయన ఏ మేరకు సక్సెస్ సాధించారనే విషయం పక్కనపెడితే… టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఆయన బాగానే దగ్గరయ్యారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్‌పైనే గెలుపొందారు. పార్టీ అయితే, బీజేపీనే కానీ, ఆయ‌న మ‌న‌సు మాత్రం టీడీపీపైనే ఉంది. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఆయ‌న‌కు వ‌ల్లమాలిన అభిమానం. ఆయ‌న‌పై పల్లెత్తు మాట కూడా అన‌లేని నైజం ఆయ‌న సొంతం. ఆయ‌నే మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌. ఇప్పుడు నిజానికి బీజేపీకి, టీడీపీకి ఎలాంటి సంబంధాలూ లేవు. అంతేకాదు, బీజేపీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీజేపీ భారీ ఎత్తున విమ‌ర్శలు చేసుకుంటున్నాయి. క‌త్తులు నూరుకుంటున్నాయి. ఈ విమ‌ర్శలు కూడా హ‌ద్దులు మీరిపోతున్నాయి. అంతేకాదు, స‌వాళ్లు కూడా విసురుకుంటున్నారు. అయినా కూడా మాజీ మంత్రి కామినేని మాత్రం ఇప్పటి వ‌ర‌కు నోరు మెద‌ప లేదు.  ఆయన బీజేపీ కంటే ఎక్కువగా టీడీపీకే విధేయత చూపిస్తున్నారనే ప్రచారం కూడా చాలాసార్లు జరిగింది. అంతేకాదు మొన్నీమధ్య జగన్ తో ప్రధాని మోదీ వేదిక పంచుకోవడాన్ని తాను చూడలేనని వ్యాఖ్యానించి… టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు బంధం తెగిపోతే తాను ఏం చేస్తాననే దానిపై పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ కేబినెట్ నుంచి బయటకు రావాలంటూ ఏపీ బీజేపీ నాయకులు తమ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. కానీ ఈ విషయం ముందుగానే తెలుసుకున్న కామినేని… సమావేశం మొదలైన కొద్ది సేపటికి ఆ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ తీర్మానాన్ని ఆమోదించారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ నిర్ణయం ఇష్టంలేకే ఆయన ఈ రకంగా వ్యవహరించారని… ఆయన ఏపీ కేబినెట్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మొత్తం ప్రత్యేక హోదా కోసం పోరు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు రెండూ కూడా బీజేపీని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏపీకి అన్యాయం చేస్తున్న పార్టీగా.. మ‌రో కాంగ్రెస్‌గా అభివ‌ర్ణిస్తున్నాయి. దీంతో అస‌లే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి ఏపీలో మ‌రింత ప‌రువు పోతోంది. బీజేపీ జెండా క‌నిపిస్తే చాలు కాల్చేయాల‌న్నంత‌గా ప్రజ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ర‌క్షించుకునేందుకు, విప‌క్షాలు, అధికార ప‌క్షం చేస్తున్న దాడుల నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకునేందుకు బీజేపీ రాష్ట్ర నేత‌లు ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా .. నేతలు టీడీపీ, వైసీపీ స‌హా ఇతర పార్టీలు త‌మ‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మౌన దీక్షలు చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. ఉద్యమంలో పాల్గొని తన‌వంతుగా నిర‌స‌న వ్యక్తం చేయాల్సిన మాజీ మంత్రి కామినేని మాత్రం దీని నుంచి త‌ప్పించుకునేందుకు ప‌క్కాప్లాన్ చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈ ఉద్యమంలో పాల్గొంటే త‌ప్పనిస‌రి ప‌రిస్థితిలోనైనా.. తాను టీడీపీని విమ‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని, అసలు దీనిలో పాల్గొన కుండా ఉంటే బాగుంటుంద‌ని ఆయ‌న డిసైడ్ అయ్యార‌ట‌. దీనికి గాను ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్యల‌ను తెర‌మీదికి తేవాల‌ని అనుకుంటున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ నేత‌లు టీడీపీపై విమ‌ర్శలు చేస్తున్నా.. ఇప్పటి వ‌ర‌కు ప‌న్నెత్తు మాట అన‌ని కామినేని ఇప్పుడు కూడా అదేవిధంగా వ్యవ‌హ‌రించేలా ప్లాన్ చేసుకుంటున్న విష‌యం స‌ర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. ఆందోళనకు హాజరైతే చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టిపోయాల్సి వస్తుంది.
Tags: Kaminine is now kim

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *