-పారాయణం, కార్తీక మాస పూజా కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంస
Date:02/12/2020
తిరుమల ముచ్చట్లు:
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్న అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ పారాయణ కార్యక్రమాలు, కార్తీక మాస పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. నాదనీరాజనం వేదికపై సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పారాయణం, వసంతమండపంలో విష్ణుపూజలు, తిరుపతిలోని కపిలతీర్థంలో హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారని వివరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టిటిడి కల్పించనుందని తెలిపారు. ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించాలని, తద్వారా వ్యక్తి వికాసంతోపాటు దేశ వికాసం కలుగుతుందని వివరించారు.టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్‌రెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
Tags: Kanchi Chairperson Sri Sri Sri Vijayendra Saraswati visits Srivastava