కండలేరు జలాలను  బీడు భూముల  వినియోగానికి ఉపయోగించాలి

Date:21/11/2020

నెల్లూరు  ముచ్చట్లు:

కండలేరు జలాలను ఉపయోగించి రాపూరు మండలం లోని బీడు  భూములను వినియోగం లోకి తెచ్చి ,సాగుకు రూపకల్పన చేయాలని తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ హరి నారాయణ రెడ్డిని, ప్రముఖ పారిశ్రామిక వేత్త,రాపూరు మండల అభివృద్ధి ప్రదాత బండి వేణుగోపాల్ రెడ్డి శనివారం కోరారు. ఈ మేరకు నెల్లూరులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాపూరు మండలం లోని గ్రామాల ప్రజల తరఫున వినతి పత్రాన్ని అందజేశారు. రాపూరు మండలం లోని తెగచర్ల, గరిమేనపెంట, బోసుపల్లి, రామ్ కూరు, పెనుబర్తి, నాగవారిపల్లి, అకిలి వలస, గుండవోలు, ఏపూరు, వెలుగోను, సైదాదు పల్లి, రాపూరు సిద్దవరం మొదలైన గ్రామాల పరిధిలోని చెరువులకు వర్షాధారం లేక సాగు భూములు బీడు భూములుగా మారాయిని,ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. రాపూరు మండల గ్రామాలలోని ప్రజలు ఏ విధమైన వ్యవసాయ పనులు లేక వలస కూలీలు గా మారారని, ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చకుండా రాపూరు మండలంలో ఉన్నటువంటి కండలేరు జలాలను ఉపయోగంలోకి తెచ్చి గ్రామాలలోని ఆయకట్టును సాగులోకి తీసుకొనివచ్చి ,మండల రైతాంగాన్ని వలసల బారినుండి రక్షించాలని  బండి వేణుగోపాల్ రెడ్డి కోరారు. స్పందించిన తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ కండలేరు జలాలను రాపూరు మండల రైతాంగానికి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసి గోసుపల్లి చెరువు, రాపూరు చెరువు రిజర్వాయర్ లుగా మార్చి ఎస్. ఎస్.కెనాల్ వచ్చేలోపు ప్రత్యామ్నాయం ద్వారా రాపూరు మండల రైతాంగానికి మేలు జరిగేలా ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, ప్రభుత్వ పరిశీలన అంతరం ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలుగు ఇంజనీర్ హరి నారాయణ రెడ్డి , బండి వేణుగోపాల్ రెడ్డికి వివరించారు.  బండి వేణుగోపాల్ రెడ్డి వెంట దాసరి చెంచయ్య వివిధ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు ఉన్నారు.

నందింగం.. ఉండవల్లి మధ్యలో డొక్కా

Tags: Kandaleru waters should be used for beed lands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *