నవంబర్ నుంచి రేషన్ షాపులలో కందిపప్పు
విజయవాడ ముచ్చట్లు:
నవంబర్ నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్
అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు ఆర్డర్ ఇచ్చింది. అయితే హాకా వద్ద కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు అంగీకరించింది.ఇందులో భాగంగా తొలి దశలో 3,660
టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయంగా
పప్పుధాన్యాల కొరతతో రేట్లు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద కూడా నిల్వలు కరువయ్యాయి. ఫలితంగా
కందిపప్పు పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హాకా నుంచి మద్దతు ధర
ప్రాతిపదికనే కందులు సేకరించినప్పటికీ.. వాటికి అదనంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు అవ్వనున్నాయి.ఈ మొత్తంలో రూ.67కు మాత్రమే కిలో కందిపప్పును ప్రభుత్వం లబ్దిదారులకు
ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపేణా ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల వద్దకు అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును
తరలించనుంది. డిసెంబర్, జనవరిల్లో పూర్తి స్థాయిలో కార్డుదారులకు సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా 50 వేల టన్నుల

కందిపప్పును కేటాయించాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసింది. తొలుత కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లోపించింది. ఆ తర్వాత రెండుసార్లు
జూన్, సెపె్టంబర్‌ల్లో కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, కేంద్రం నుంచి స్పందన రాలేదు.మండల స్టాక్ సెంటర్ (ఎంఎల్‌ఎస్)ల్లోని స్టాక్ మొత్తాన్ని పంపిణీకి విడుదల
చేయడంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే
కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది.భవిష్యత్తులో అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు జనవరి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్ ధరకు ప్రభుత్వం
కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలనే యోచనలో ఉన్నారు. వాటిని స్వయంగా మరాడించి ప్యాకింగ్ చేయించి సబ్సిడీపై కార్డుదారులకు అందించేలా ప్రణాళిక
రూపొందించారు.
Tags: Kandipappu in ration shops from November
