కనిమొళి వర్సెస్ సౌందరరాజన్

Date:13/04/2019
చెన్నై ముచ్చట్లు :
త‌మిళ‌నాడులోని తూత్తుకుడి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌. ఆ లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు త‌మిళ‌సాయి సౌంద‌ర్య‌రాజ‌న్ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి డీఎంకే త‌ర‌పున రాజ్య‌స‌భ ఎంపీ క‌నిమొళి కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు నెల‌కొన్న‌ది. ఇద్ద‌రూ రాజ‌కీయ నేతల కూతుళ్లు కావ‌డం విశేషం. దివంగ‌త డీఎంకే అధ్య‌క్షుడు క‌రుణానిధి కూతురే క‌నిమొళి. ఆమె సోద‌రుడు ఎంకే స్టాలిన్ ఇప్ప‌డు ఆ పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. కాంగ్రెస్ నేత కుమారి అనంత‌న్ కూతురే సౌంద‌ర్య‌రాజ‌న్‌. ఆమె సోద‌రుడు వ‌సంత్‌కుమార్‌.. క‌న్యాకుమారి నుంచి లోక్‌స‌భ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. మొత్తం 37 మంది అభ్య‌ర్థులు తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నారు. అక్క‌డ 14.25 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు. ఇటీవ‌ల ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స్టెరిలైట్ కాప‌ర్ ప్లాంట్‌కు వ్య‌తిరేకంగా భారీ ఆందోళ‌న చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది మే 13న జ‌రిగిన ఫైరింగ్‌లో 13 మంది ఆందోళ‌న‌కారులు మృతిచెందారు. అయితే అక్క‌డున్న కార్మికులు డీఎంకేకి మొగ్గు చూపుతారా లేక బీజేపీకి ఓటు వేస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:Kanimozhi vs Saundarajan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *