Natyam ad

కాణిపాకం టూ తిరుమల..దళారీల దందా

తిరుపతి ముచ్చట్లు:


తిరుమల పుణ్యక్షేత్రంలో దళారులు చాప కింద నీరులా భక్తులను మోసగిస్తున్నారు. దర్శనం కోసం చూసే భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువునా దోచేస్తున్నారు. దర్శన టోకెన్లు లేని భక్తులను గుర్తించి వారి వద్ద అధిక మొత్తంలో నగదు వసూలు చేసి జోబులను నింపుకుంటున్నారు కొందరు దళారులు. ఏడుకొండలపై పిఆర్ఓల పేరుతో కొందరు దళారులు భక్తులను బురిడీ కొట్టిస్తూ అందిన వరకూ దోచేస్తూ వేలకు వేలు దండుకుంటున్నారు. తాజాగా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్టు గ్యాస్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న కరుణాకర్ అనే దళారి మూడు వందల రూపాయలు విలువ గల సుపధం మార్గం దర్శనంను సేవగా భక్తులను నమ్మించి 12 సుపధం టిక్కెట్లను అధిక ధరకు విక్రయించిన‌ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దళారితో పాటుగా కాణిపాకం ఆలయ ఏఈవోను సైతం పోలీసులు విచారిస్తున్నారు.ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మారుమోగుతుంటాయి. స్వామి వారి దర్శనం పొందేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. స్వామి వారికి ఉన్న డిమాండ్ నే కొందరు క్యాష్ చేసుకుని కొందరు అమాయకులను నమ్మించి నిలువుగా దొపిడి చేస్తున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భాధ్యతలు చేపట్టిన తరువాత కొండపై దళారుల ఏరివేతకు టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తులను మోసగించే దళారులపై కేసు నమోదు చేసి కఠన చర్యలు తీసుకున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు నెమ్మకుండి పోయినా దళారులు కొత్త కొత్త ఆలోచనలతో, చాప కింద నీరులా భక్తులను మోసగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

 

 

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ లో గ్యాస్ ఆపరేటర్ గా కరుణాకర్ విధులు నిర్వహిస్తున్నాడు. కాణిపాకం ఆలయంలో గత కొద్ది రోజుల‌ కిందట కొంత వివాదంలో చిక్కుకోవడంతో కరుణాకర్ ను ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో తిరుమలలో కాణిపాకం ఆలయ పిఆర్ఓగా అవతారం ఎత్తాడు. కాణిపాకంలో పని చేస్తున్న సమయంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సులభతరంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం పరిచయం ఉన్న అధికారులు, రాజకీయ నాయకుల నుంచి దర్శనం‌ సిఫార్సు లేఖలను పొంది దర్శనం లేని భక్తులను గుర్తించి వారి పేర్లతో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం, జేఈవో కార్యాలయంలో కాణిపాకం ఆలయం పిఆర్ఓగా చెప్పకుంటూ దర్శనాలు పొందుతూ వచ్చేవాడు. ఈ టిక్కెట్లను సుదూర‌ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు అధిక ధరలకు విక్రయించేవాడు. గతంలో కాణిపాకం ఈవోగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్ తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలని టీటీడీకి లెటర్ పంపాడు. అందులో మరో ముగ్గురి పేర్లు చేర్చిన కరుణాకర్ వారి వద్ద అధిక డబ్బును వసూలు చేశాడు. ఈవో కుటుంబ సభ్యులతో పాటు వీరు ఎవరు అని విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నించడంతో మూడు టిక్కెట్లు అమ్మేశాడని తేలింది. ప్రముఖ ఆలయం, తన పరువు పోతుందని, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని‌ వెంకటేశ్ విన్నవించుకోవడంతో కరుణాకర్ ని‌ మందలించి వదిలి పెట్టారు. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులకు దర్శనంకు వెళ్ళేందుకు సిఫార్సు లేఖ కావాలని చెప్పి మరో‌సారి ఆలయంలోని‌ ఓ‌ అధికారి పేరు‌ మీదుగా విఐపి బ్రేజ్ దర్శనం టిక్కెట్లను పొంది వాటిని అధిక ధరలకు విక్రయించాడు.

 

 

 

Post Midle

ఈ విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయ‌ ఈవో కరుణాకర్ ను పిలిచి‌గెట్టిగా మందలించాడు. కొద్ది‌రోజుల పాటు తన రహస్యంగా బయటి అధికారులు, రాజకీయ నాయకుల‌ సిఫార్సు‌ లేఖలపై దర్శనాలను‌ పొందుతూ వాటిని విక్రయిస్తూ వచ్చేవాడు. సిఫార్సు లేఖ లభించక పోవడంతో తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలంటూ కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని కోరాడు.  కాణిపాకం ఆలయంలోని అన్నదాన సత్రంలో గ్యాస్ ఆపరేటర్ గా పని చేసే సమయంలో కాణిపాకం ఆలయ ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న మాధవ్ రెడ్డి తో కరుణాకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకే ఆలయంలో పని చేస్తున్న వ్యక్తులు కావడంతో ఏఈవోతో మరింత స్నేహపూర్వకంగా మెలిగేవాడు కరుణాకర్. మాధవ్ రెడ్డి వద్ద లెటర్ హెడ్ పొందిన కరుణాకర్ కర్ణాటక రాష్ట్రం, చింతామణికి చెందిన కేశవమూర్తి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. శ్రీవారి వద్ద కూర్చొని ఉండే సేవ టిక్కెట్లు తీసిస్తానని నమ్మబలికాడు. ఒక్కో టికెట్ ధర రూ. 6000 వేలుగా బేరం ఆడాడు. చివరికి ఒక్కో టికెట్ ధర రూ. 3300గా నిశ్చయించాడు. చివరకు ఆ భక్తులను సుపథం టిక్కెట్ల ద్వారా దర్శనానికి తీసుకెళ్లాడు. సేవ అని చెప్పి సుపథంకి తీసుకెళ్లాడని కరుణాకర్ పై పోలీసులకు పిర్యాదు చేసాడు కేశవమూర్తి. దింతో కరుణాకర్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఈ టిక్కెట్ల స్కాంకు సంబందించి కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు పోలీసులు.

 

Tags: Kanipakam to Tirumala

Post Midle