సత్యదేవ్ 26 – ఈశ్వర్ కార్తీక్‌- ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మల్టీ స్టారర్ లో కన్నడ స్టార్ డాలీ ధనంజయ

హైదరాబాద్


వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ 26వ చిత్రాన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి  ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో  ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం ధనంజయ కూడా 26వ చిత్రమే . ఇద్దరు వెర్సటైల్ నటులు ఒక సినిమాలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటే క్యురియాసిటీని పెంచుతోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో పోస్టర్‌లో గుర్రంతో పాటు తుపాకీ, బుల్లెట్లు, కరెన్సీ నోట్లు కనిపించ ఆసక్తికరంగా వుంది. సత్యదేవ్ పోస్టర్‌లో ఎరుపు రంగు థీమ్ ఉండగా, ధనంజయ కోసం గ్రే థీమ్ పోస్టర్ డిజైన్ చేయడం వైవిధ్యంగా వుంది.

 

బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

 

Tags: Kannada star Dolly Dhananjaya in Satyadev 26 – Ishwar Karthik- Old Town Pictures multi starrer

Leave A Reply

Your email address will not be published.