కూతురు పట్ల కన్నతల్లి కర్కశత్వం… చిన్నారి గొంతును బ్లేడ్‌తో కోసిన తల్లి

నారాయణపేట ముచ్చట్లు:
అభం శుభం తెలియని కూతురు పట్ల కన్నతల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఈ ఘటన జిల్లాలోని ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొతోళ్లు రమేష్, మంజుల దంపతులకు నలుగురు సంతానం. ఈ క్రమంలో బుధవారం తమ పెద్ద కుమారుడు శివ కుమార్ బర్తడే జరుపుకున్నారు. పుట్టిన రోజు అనంతరం దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన తల్లి మంజుల చిన్న కూతురు శివాని (3) చిన్నారి గొంతును బ్లేడ్‌ కోసింది.ఆ తర్వాత తాను కూడా గొంతును కోసుకుంది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని స్థానికులు చికిత్సకోసం హైదరాబాద్ నీలోఫర్ దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా మంజుల కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తోందని ఆమె భర్త రమేష్, చుట్టుపక్కల నివాసముంటున్న కాలనీ ప్రజలు పేర్కొన్నారు. కాగా జరిగిన సంఘటనపై స్థానికులు 100 డయల్ చేయడంతో ఉట్కూర్ ఎస్ఐ రవి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Kannathalli’s harshness towards her daughter … The mother who cut the child’s throat with a blade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *