అమరావతి ముచ్చట్లు:
ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా ఉంటారు. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్ ఏర్పాటు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలకపాత్ర పోషించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది.
Tags;Kannayya Naidu is the advisor of water resources department in AP