విశాఖలో కపిల్ దేవ్

విశాఖపట్నం ముచ్చట్లు:


ఆంధ్ర ప్రదేశ్ లోని అభిమానులు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించేందుకు విశాఖ ఏపీఎల్ టోర్నమెంట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులకు ఏమాత్రం తగ్గకుండా ఏపిఎల్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపిఎల్ ఫైనల్ మ్యాచ్ మరింత అద్భుతంగా నిర్వహించాలని భావించిన నిర్వహకులు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్  దేవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఏపిఎల్ ఫైనల్ కు అంతా సిద్దమైన సమయం లో వరుణుడు షాకిచ్చాడు. విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఇలా వర్షంతో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడం నిరుత్సాహం కలిగిందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఏపీఎల్ నిర్వహణ వల్ల ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లకు దేశం తరుపున ఆడే అవకాశం లభిస్తుందని అన్నారు. తనకు ఇష్టమైన విశాఖలో మరింత ఇష్టమైన క్రికెట్ ఫోటీని వీక్షించేందుకు రావడం సంతోషంగా వుందని కపిల్ దేవ్ అన్నారు.

 

Tags: Kapil Dev in Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.