ఘనంగా ప్రారంభమైన కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల  ముచ్చట్లు:
 
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కొవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వహించనున్నారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వరస్వామి, శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
 
Tags; Kapileswaraswamy Annual Brahmotsavalu which started well

Leave A Reply

Your email address will not be published.