వైసీపీలో కాపు సెగ రాధా, సామినేని, అంబటి

Kapu Sega Radha, Samoeni, Ambati

Kapu Sega Radha, Samoeni, Ambati

Date:18/09/2018
విజయవాడ ముచ్చట్లు:
జ‌న‌సేన ప్ర‌భావం.. వైసీపీలోని కాపు నేత‌ల‌పై బాగానే ప‌డుతున్న‌ట్టుంది. మున్ముందు ఇంకెటువంటి అనుభ‌వాలు చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే ఆందోళ‌న‌ప‌డుతున్నారు. వాస్త‌వానికి 2014లో టీడీపీ గెలుపులో కాపు వ‌ర్గం పాత్ర ఉంద‌నేది చంద్ర‌బాబు అంగీక‌రించే వాస్త‌వం. బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వులతో బాగానే చేరువ‌య్యారు. కానీ.. జ‌న‌సేన టీడీపీ నుంచి వేరుకావ‌టం పైగా చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై నిప్పులు కురిపించ‌టంతో.. కాపులు కూడా.. ఈ ద‌ఫా.. జ‌న‌సేన వైపు మ‌ళ్ల‌తార‌నే ప్ర‌చారం సాగుతుంది.
ఒక‌వేళ ఎవ‌రికీ పూర్తిస్థాయి మెజార్టీ రాక‌పోయినా. జ‌న‌సేన టీడీపీ వైపు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలున్నాయి. జ‌గ‌న్ అంటే పూర్తి వ్య‌తిరేక‌త ఉన్న ప‌వ‌న్ ఆ ప‌నిచేయ‌డ‌నే భ‌రోసా ఉంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో కాపుల్ని ప‌క్క‌న‌బెట్ట‌డం ద్వారా మిగిలిన కులాల మ‌ద్ద‌తు పొందాల‌నే ఆలోచ‌న‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నాడు. దీనిలో భాగంగానే కాపుల రిజ‌ర్వేష‌న్ నా ప‌రిధిలో లేదంటూ వివాదానికి తెర‌లేపారు. అంత‌కుముందే.. వంగ‌వీటి రంగాపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ నేత గౌతంరెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌కుండా నాట‌కం న‌డిపించారు. అనంత‌రం పాద‌యాత్ర‌లో అంతాతానై గౌతంరెడ్డి చ‌క్రంతిప్పాడు.
దీంతోనే ఒళ్లుమండిన వంగవీటి రాధాగుర్రుగానే ఉన్నాడు. ఇప్పుడు.. ఏకంగా సెంట్ర‌ల్ విజ‌య‌వాడ సీటును మ‌ల్లాది విష్ణుకు దారాదాత్తం చేసి.. వంగ‌వీటిని నువ్వు మ‌చ‌లీప‌ట్నం వెళ్ల‌మంటూ తేల్చిచెప్పాడు. దీంతో.. స‌మావేశం మ‌ధ్య‌లోనే రాధా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇంత‌టి అవ‌మానం.. వంగ‌వీటి కుటుంబానికి జ‌రిగిన‌ట్టుగా గాకుండా.. కాపులు త‌మ‌దే అన్నంత‌గా జ‌గ‌న్‌పై ర‌గిలిపోతున్నారు. వంగ‌వీటి శ్రీనివాస్ వైసీపీకు రాజీనామాచేశాడు.
జ‌న‌సేన‌లో చేర‌వ‌చ్చ‌నే ప్ర‌చారం సాగుతుంది. ఇలా.. మొన్న ముద్ర‌గ‌డ‌. ఇప్పుడు వంగ‌వీటి.. రేపు.. అంబ‌టిరాంబాబు, సామినేని ఉద‌య‌భాను కోరుకునే సీట్లకూ ఎస‌రు త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కాపుల‌ను న‌మ్ముకున్నా రేప‌టిరోజున టీడీపీ, జ‌న‌సేన వైపు చేర‌తార‌నే అభిప్రాయంతోనే జ‌గ‌న్‌.. కాపుల‌కు పొమ్మ‌న‌కుండా పొగ‌పెడుతున్నారంటూ.. కాపు వ‌ర్గం మండిప‌డుతుంది.
అలాగ‌నీ.. విష్ణు అక్క‌డ గెలుస్తాడా అంటే.. మొన్న‌నే.. ఆయ‌న మ‌ద్యం దుకాణంలో కల్తీ మ‌ద్యం తాగి ఎంతోమంది నిరుపేద‌ల మ‌ర‌ణించారు. ఆయ‌న‌పై కేసులున్నాయి. అయినా.. జ‌గ‌న్ గెలుపోట‌ముల‌ను ప‌క్క‌న‌బెట్టి.. నిర్ణ‌యం తీసుకోవ‌టం.. కేవ‌లం కాపుల‌పై క‌క్ష‌సాధింపే అనేది కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా భావిస్తుంది. ఈ లెక్క‌న‌.. కోస్తా, గోదావ‌రి జిల్లాల్లో కాపులంతా ఏక‌మైతే.. పాపం వైసీపీ.. మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షంలో ఉండాల్సిందేనేమో!
Tags:Kapu Sega Radha, Samoeni, Ambati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *