శ్రీ రెడ్డిపై శివాలెత్తిన కరాటే కళ్యాణి

Karate Kalyani on Shree Reddy

Karate Kalyani on Shree Reddy

Date:20/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి. శ్రీరెడ్డి.. పవన్ పవన్ కళ్యాణ్‌పై చేసిన దారుణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చాలా శాంతంగా ఉన్నారని.. అయితే నీకు కరెక్ట్ మొగుడ్ని నేనే అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది కళ్యాణి. సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘శ్రీరెడ్డి… నువ్వో పెద్ద పెంటవి అని నిన్ను నువ్వే బయటపెట్టుకున్నావు. పోరాటం, న్యాయం, ధర్మం అంటున్నావ్.. అసలు నీకు ఏం కావాలో కొంచెమైనా క్లారిటీ ఉందా?. టీవీలకు వెళ్లి రచ్చ చేయడం నీకే వచ్చా.. మేం వస్తుంటే ఎందుకు పారిపోతున్నావ్. అకారణంగా పవన్ కళ్యాణ్‌ను ఎందుకు తిట్టావ్. ఆయన తల్లిని ఎందుకు దూషించావ్.. నీ తల్లిని అంటే ఒకటి ఆయన తల్లిని అంటే ఒకటా? అసలు నీ వెనుక ఎవరు ఉన్నారో బయటపడదని అనుకుంటున్నావ్ కదా? కొంచెం వెయిట్ చేయి త్వరలోనే అందరి బండారం బయటపెడతాం.ఏంటీ.. శ్రీ శక్తి అని పేరు పెట్టుకుంటావా? నీకు పేర్లు మార్చడం మామూలే కదా. మార్చుకో నీ పేరు శ్రీ శక్తి, ఛీ.. రెడ్డి అని పిలివాలి. నువ్ ఛీ..ఛీ రెడ్డివి. ఇండస్ట్రీ పరువును బజారు కీడ్చావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై పడ్డావా? ఆర్టిస్టుల పరువు తీశావు. పరిశ్రమలో ఉన్న మేం టాలెంట్‌ను నమ్ముకుని నిజాయితీగా బ్రతికాం. నీలా ఎవడితోపడితో వాడితో పోయి బ్రతకలేదు. ఇండస్ట్రీ కోసం బలైపోవడానికైనా నేను రెడీ.. కాని నీపై పోరాటం సాగిస్తా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా నువ్వ చేసిన తప్పుల్ని ఒప్పుకో. తప్పకుండా నువ్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నువ్ ఎవరి అండను చూసి రెచ్చిపోతున్నావో అదే ఛానల్స్‌ నిన్ను ఛీ కొట్టబోతున్నాయ్. ఖబద్దార్ శ్రీరెడ్డి.. ఇంకోసారి పవన్‌ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని విమర్శిస్తే.. ఊరికునే పరిస్థితి లేదు. మా రక్తం మరిగిపోతుంది. కొన్ని కోట్ల మంది దేవుడిగా భావించే వ్యక్తిని తిడతావా. వాళ్ల మనోభావాలతో ఆడుకుంటావా? మీ అమ్మ, నాన్న కడుపున చెడపుట్టావ్.. నీ లాంటి వ్యక్తి ఆడజాతిలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా.. అసలు నీది మనిషి పుట్టుకేనా? సిగ్గులేని ఆడజన్మ నీది. ఆడజాతికే నీ పుట్టుక అవమానం. ఏంటీ.. అందరి గుట్టు బయట పెడతావా? అసలు నీ గుట్టు బయటపడకుండా చూసుకో ముందు. అసలు నువ్ అమెరికా వెళ్లి ఎంత సంపాదించావో లెక్కలు బయటకు తీయమంటావా? నువ్ అమెరికాలో సర్వీస్ అపార్ట్‌మెంట్ తీసుకుని ఏం చేశావో చెప్పమంటావా? నీ బాధితులు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీయాలా? నువ్ అమెరికాలో ఏం చేసి డబ్బులు సంపాదించావో అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. టైం వస్తే నేనూ బయటకు తీస్తా. నీ బండారం మొత్తం బయటపెడతా.టీవీ చర్చల్లో ఎన్ని అబద్దాలు చెబుతున్నావ్.. నీకు తాగుడు అలవాటు లేదా? తీయమంటావా నువ్ తాగి తూగిన ఫోటోలు. కత్తి మహేష్‌ని వాటేసుకుని ఫోటోలు దిగలేదా? రమేష్ పుప్పాల పుట్టినరోజు నాడు నువ్ తాగి తూగిన ఫోటోలు తీయమంటావా బయటకి. 8 ఏళ్ల పాపను దారుణంగా రేప్ చేసి చంపేస్తే.. ఒక్క మహిళా సంఘనాయకురాలు టీవీ చర్చల్లో పాల్గొన్న పాపాన పోలేదు. అంతే దారుణంగా పెళ్లాలే మొగుళ్లను చంపేస్తుంటే ఒక్కరూ మాట్లాడరు కాని ఇలాంటి ఛీ.. రెడ్డి విషయంలో జనం ఛీ.. కొట్టే విషయాల్లో మాత్రం మహిళా సంఘాలు బాగా స్పందిస్తున్నాయి అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు కరాటే కళ్యాణి.
TAgs:Karate Kalyani on Shree Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *