క్రమశిక్షణ, వినయం, విధేయత, వీరత్వకనికి ప్రతీక  కరాటే

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్

సంగారెడ్డి ముచ్చట్లు:

;క్రమశిక్షణ, వినయం, విధేయత, వీరత్వం తో కూడిన కరాటే కళారంగం మనిషి యొక్క ఆత్మ స్థైర్యాన్ని పెంచి తనను తాను రక్షించుకునడమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, మరియు దేశ రక్షణ కోసం భావితరాల భవిష్యత్ కోసం ఆదర్శంగా నిలిచే అటువంటి గొప్ప కళరంగం కరాటే అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అన్నారు.సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం, బసవ సేవాసదన్ ఫంక్షన్ హాల్ లో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరాటే సీనియర్ మాస్టర్ లు కరాటే చందర్ మాస్టర్, కరాటే కనిగిరి శంకర్ గౌడ్ మాస్టర్ నిర్వహించిన సమావేశానికి  ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు వారి వారి యొక్క కార్యక్రమాలను సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా ఎల్లవేళల ఉపయోగించుకోవచ్చనిఅన్నారు.. అదేవిధంగా భావితరాల భవిష్యత్ కోసం సమాజ శ్రేయస్సు కోసం ఎప్పుడు ముందుంటానని తెలిపారు..

 

 

తదనంతరం స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి  మొగులయ్యగౌడ్ జ్ఞాపకార్ధంగా దేశభక్తిని పెంపొందించడం కోసం,భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన అటువంటి కార్యచరణను అందరికీ అందుబాటులో ఉండే విధంగా విశిష్టమైన నైపుణ్యంతో కూడిన మెగా పిరమిడ్ నిర్మాణానికి స్థలాన్ని పరమశివ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ కమిటీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీనియర్ కరాటే మాస్టర్ల సమక్షంలో , విద్యార్థుల సమక్షంలో, పట్టణ ప్రముఖుల సమక్షంలో తెలంగాణ కరాటే అసోసియేషన్ చీఫ్ గెస్ట్ రామ్ పాల్ సుదర్శన్ ప్రతిభ వంతులైన కరాటే విద్యార్థులకు గ్రేడ్ బెల్ట్ మరియు సర్టిఫికెట్ పంపిణీ సదాశివపేట పట్టణ సిఐ నవీన్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కరాటే సీనియర్ మాస్టర్ లు సిద్దు స్వామి మాస్టర్, అశోక్ మాస్టర్, బిక్షపతి మాస్టర్, నాగేశ్వర్ మాస్టర్, సతీష్ గౌడ్ మాస్టర్, మహేష్ మాస్టర్, మరియు తదితర సీనియర్ మాస్టర్లు పాల్గొన్నారు.

 

Tags: Karate symbolizes discipline, humility, loyalty and heroism

Leave A Reply

Your email address will not be published.