కార్తీ  బ్రిటన్ టూర్ కు ఓకే

Kardi is okay to the UK tour

Kardi is okay to the UK tour

Date:18/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు :
కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమరుడు కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతించింది. తన కుమార్తె అడ్మిషన్‌ కోసం కార్తీ చిదంబరం బ్రిటన్‌ పర్యటనకు వెళ్లేందుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈనెల 20 నుంచి 31 వరకూ ఏ ఇబ్బంది లేకుండా కార్తీ చిదంబరం బ్రిటన్‌లో పర్యటించేందుకు మార్గం సుగమం అయింది. కార్తీ చిదంబరం ప్రస్తుతం ఎయిర్‌సెల్‌ – మ్యాక్సిస్, ఐఎన్‌ఎక్స్‌ మీడియా, మనీ లాండరింగ్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు.
ఈడీ, సీబీఐలు కార్తీపై క్రిమినల్‌ కేసులను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తన కూతురు అడ్మిషన్ పని నిమిత్తం బ్రిటన్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన స్వేచ్ఛను కార్తీ దుర్వినియోగం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ న్యాయస్థానానికి వివరించాయి.
కార్తీ విన్నపాన్ని మన్నించిన సుప్రీం ధర్మాసనం ఆయన విదేశీ పర్యటనకు కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. విదేశాలలో కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించడం లేక మూసివేయడం చేయరాదని కోర్టు కార్తీని హెచ్చరించింది. ప్రయాణానికి సంబంధించిన విమాన వివరాలు, వెళ్లే తేదీ, భారత్‌కు తిరిగివచ్చే తేదీ వివరాలు సమర్పించాలని ధర్మాసనం సూచించింది. స్వదేశానికి తిరిగి రాగానే దర్యాప్తు సంస్థలకు పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది.
Tags:Kardi is okay to the UK tour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *