లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్-కార్గిల్ యుద్ద వీరులకు సత్కారం

నంద్యాల  ముచ్చట్లు:

మంగళవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులను సత్కరించి, అమరులైన వీర సైనికులకు నివాళులర్పించారు.
నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సైనికులు రవీంద్రనాథ్, రామరాజు లను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ.ఎమ్.ఎ. ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1999లో కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ సైనికుల్ని తరిమికొట్టి భారత ఆధీనంలోకి తెచ్చుకున్న ఈ రోజును కార్గిల్ విజయ దినోత్సవం గా దేశమంతా  అమరులైన వీర సైనికులకు నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తు మననం చేసుకుంటామని అన్నారు. వారి స్ఫూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు. సరిహద్దులలో అహర్నిశలు దేశాన్ని కాపాడుతున్న వీర జవాన్ల త్యాగాలు గుర్తుంచుకుని ,దేశ సమగ్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

 

ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులు  రవీంద్రనాథ్, రామరాజు మాట్లాడుతూ తాము కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నామని అయితే ఎందరో వీరుల ప్రాణ త్యాగం వల్లే కార్గిల్ ని మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగామని అన్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ ప్రతి ఏటా కార్గిల్ విజయ దివస్ రోజున మాజీ సైనికులను ఆహ్వానించి సత్కరించడం ప్రశంసనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్, కూరా ప్రసాద్, కోశాధికారి రత్న, ప్రాంతీయ చైర్మన్ కసెట్టి చంద్రశేఖర్, సీనియర్ లయన్స్ సభ్యులు రమణయ్య, బాబు రావు, రామన్న, మనోహర్ రెడ్డి, యూసుఫ్, సందీప్, సాయి మనోజ్, సప్తగిరి రెడ్డి పాల్గొన్నారు.

 

Tags: Kargil Vijay Divas- Tribute to Kargil War Heroes under the aegis of Lions Club

Leave A Reply

Your email address will not be published.