Natyam ad

అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన కరీంనగర్

బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి

కరీంనగర్ ముచ్చట్లు:

కరీంనగర్ కేంద్రంగా రోజురోజుకు భూకబ్జాలు, టెండర్లలో అవినీతి, అక్రమాలు, నాణ్యత లేని పనులతో చెక్ డ్యాంలు కొట్టుకుపోవడం,  స్మార్ట్ సీటీ పనులలో రోడ్లు, ఫుట్ పాత్ లు కుంగిపోవడం లాంటి దురదృష్టకర సంఘటనలు  జరుగుతున్న కమిషన్లకు కక్కుర్తి పడి నేతలు, అధికారులు మౌనంగా ఉంటూ ఉద్యమాల కరీంనగర్ గడ్డను అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చినారని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికై శివారు గ్రామాలు నగరంలో విలీనం కావడంతో భూముల రేట్లకు రెక్కలు రావడంతో అధికార పార్టీ నేతలతో పాటు, భూకబ్జాదారులు యాదేచ్చగా అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములతో పాటు సామాన్యుల భూములకు ఎసరు పెట్టి అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ భూదందాలు ఎక్కువగా నగరంలోని ఖాళీ ప్లాట్లతో పాటు బొమ్మకల్, తీగల వంతెన, బైపాస్ రోడ్డు నుండి చింతకుంట రోడ్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి ప్రాంతాలతో పాటు స్మశాన వాటికల భూములు, గుట్ట భూములు, చెరువులు, కుంటలు,

 

 

Post Midle

ఒర్రె భూములన్ని కూడా కబ్జాకోరులు స్వాహా చేస్తున్నారని, వీటి పై అధికారులకు ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులను చెత్త బుట్టలో వేసి నేతలకు, బడా బాబులకు, కబ్జాకోరులకే వంత పాడుతున్నారని బేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే చెక్ డ్యాం టెండర్లలో అనేక అక్రమాలు జరిగి వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగంకు గురైందని, దీనికి ముఖ్య కారణం కాంట్రాక్టు నియమ, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లకు, క్వాలిఫై లేని దొంగ ఫర్మ్ లకు అధికార పార్టీ ఒత్తిడితో ఇరిగేషన్ అధికారులు పనులు అప్పజెప్పడంతోనే చెక్ డ్యాంలు కొట్టుకుపోయి నేలపాలైనని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఇదే కాకుండా దేశంలో 100 స్మార్ట్ సిటీలను ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే అందులో ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైన కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా దక్కుతే దానిని సక్రమంగా వినియోగించుకొని వచ్చిన నిధులతో సమగ్ర అభివృద్ధి చేయాల్సింది .

 

 

పోయి వస్తున్న నిధుల నుండి ఎవరికీ ఎంత శాతమో నిర్ణయించుకొని అధిక మొత్తంలో కమిషన్లు తీసుకుంటూ స్మార్ట్ సీటీ పనుల పై పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని పనుల కారణంగా కొన్ని రోజులకే రోడ్లు, ఫుట్ పాత్ లు కుంగిపోవడం, చిన్న వర్షాలకే గుంతలు పడటం జరుగుతున్నాయని బేతి మహేందర్ రెడ్డి విమర్శించారు. ఈ అవినీతి, అక్రమాలన్నింటి పై  సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారి పైనే తప్పుడు కేసులు పెట్టి నేరస్తునిగా ముద్ర వేస్తున్నారని బేతి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికార పార్టీ నేతలకు చేరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Tags: Karimnagar has become an obstacle to corruption and illegality

Post Midle