కరీంనగర్‌..ఉద్యమాల పురిటిగడ్డ

 Date:08/04/2019
కరీంనగర్ ముచ్చట్లు :
కరీంనగర్‌..ఉద్యమాల పురిటిగడ్డ . కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకమే. అన్ని పార్టీలకు కీలకమే. ఓటర్లు ప్రతీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తూ అందరి నాయకుల్ని ఆదరించిన సందర్భాలు గత చరిత్రలో ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న పార్లమెంటు నియోజకవర్గంగా కరీంనగర్‌‌కు పేరుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బి.వినోద్ ఎంపీగా గెలిచారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వినోద్ మరోసారి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు.ఓసీలకు ముఖ్యంగా వెలమలకు కంచుకోట కరీంనగర్. నియోజకవర్గం ఏర్పడిన నుంచి ఆసామాజిక వర్గానికి చెందిన వారు లేకుండా ఎన్నికలు ఉండేవి కావు. నియోజక వర్గం అవిర్భావం నుంచి భిన్న పార్టీల సభ్యులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఇక్కడిప్రజలు ఆమితాసక్తిని చూపించారు. ఒకే వ్యక్తికి రెండు నుంచి మూడు పర్యాయాలు అవకాశమిచ్చినా.. మరో ఎన్నికల్లో వేరే వారిని ఎన్నుకున్నా.. పనితీరు బాగోకుంటే నిర్మొహమాటంగా వేరే అభ్యర్థిని గెలిపించుకున్నా.. అది కరీంనగర్‌పార్లమెంటు స్థానంలోని ప్రజానీకానికే చెల్లింది.లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్… కచ్చితంగా ఏదో ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే.
అయితే కరీంనగర్ నుంచి మళ్లీ వినోద్ బరిలోకి దిగితే… ఇక కేసీఆర్ మెదక్ లేదా నల్లగొండల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ ఎంపీ వినోద్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి కరీంనగర్‌తో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. మానకొండూర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, కోరుట్ల నియోజవర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమే. పార్లమెంటు ఏర్పాడిన తరువాత 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 2004 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కేసీఆర్ గెలిచారు. అనంతరం 2006, 2008లో జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థుల బలబలాలను చూస్తే..టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. ఉమ్మడి జిల్లాల్లో టీఆర్ఎస్‌కు పట్టుండంతో గెలుపు తమదేనని ధీమా వ్యక్తంచేస్తున్నారు వినోద్. ఇక కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న పొన్నం ప్రభాకర్ 2009లో ఎంపీగా గెలిచారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ కూడా రేసులో ఉన్నారు. సంస్థాగతంగా ఇక్కడ బీజేపీకి పట్టుండడం..స్థానికంగా బండి సంజయ్‌కు మంచి పేరు ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. స్థానిక యువతతో కలిసిపోయి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని ఆయనకు పేరుంది. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మే 23న తేలనుంది.
Tags:Karimnagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *