కర్మన్ ఘాట్ ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రసాభాస 

Date:19/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కర్మన్ ఘాట్ లోని ప్రముఖ ధ్యానంజనేయ  ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. కమిటీలో అగ్ర కులాలకు తాంబూలం ఇస్తూ , అణగారిన వర్గాలను అనగా దొక్కుతున్నారని, స్థానిక దళితులకు , బీసీ లకు, అవకాశం ఇవ్వకుండా అనగదొక్కుతున్నారని , చిన్న చూపు చూస్తూ , అవమానాలకు గురిచేస్తున్నారంటూ స్థానికులు గుడి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నూతన పాలకమండలి చైర్మన్ కోతి నర్సిరెడ్డి, పాలకమండలి సభ్యుల తో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి , పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి  , శాసనసభ సభ్యుడు తీగల క్రిష్ణా రెడ్డి నూతన పాలక వర్గం చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి , ప్రతిష్టకు , భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తామని నూతన కమిటీ తెలిపింది.  ప్రమాణ స్వీకారం సభ్యులు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags: Karman Ghat temple chairman is a member of the swearing-in ceremony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *