మే 12న కర్ణాటక అసెంబ్లీ పోలింగ్

Date:27/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. 224 స్థానాలున్న కర్టాటక శాసనసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మే 12 న అన్ని నిజయోకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించి, మే 15 న ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది. మే 28తో కర్ణాటక శాసనసభ గడువు ముగియనుండగా ఆలోగా ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రభుత్వం ఏర్పడేలా షెడ్యూల్‌ను ఈసీ నిర్ణయించింది.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. 15న ఫలితాలు వెలువడుతాయని వెల్లడించింది. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుపుతున్నట్టు పేర్కొంది. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వినియోగించనున్నట్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలను కూడా ఈవీఎంలకు జత చేస్తున్నామని… దీనివల్ల ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురికాకుండా ఉంటారని వెల్లడించింది. పోలింగ్ బూత్ లలో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని… 450 పోలింగ్ స్టేషన్లను మొత్తం మహిళలే నిర్వహిస్తారని చెప్పింది. ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఎన్నికల కోడ్ రాష్ట్రానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.గత ఎన్నికల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని ఈసీ తెలిపింది. తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకునేలా… బలహీనవర్గాల ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుకు సంబంధించి రూ. 28 లక్షలకు సీలింగ్ విధిస్తున్నామని తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 4.96 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 56,996 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 2013 ఎన్నికల కంటే ఇవి 9 శాతం అదనమని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీవీప్యాట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఓటు వేయడానికి వచ్చే దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది.ఏప్రిల్‌ రెండోవారంలో షెడ్యూలును ప్రకటించాలని భావించినా, అంతకు ముందే షెడ్యూలు విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిసిన అనంతరం మే నెలలో ఒకే దశలో ఎన్నికలు ఉంటాయని ఈసీ సూచనప్రాయంగా తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. కాంగ్రెస్ మరోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తుండగా, ఎలాగైనా కర్ణాటక పీఠాన్ని తమ సొంతం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఇప్పటికే వ్యూహరచన చేశారు.
Tags:Karnataka Assembly polling on May 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *