కర్నాటక బస్సు ప్రమాదం…

బాధితులకు ఆర్ధిక సహాయం అందజేత

కర్నాటక ముచ్చట్లు:


కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అందచేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శర్మన్ ఇతరులు పాల్గోన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున చెక్కులు అందజేసారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కర్ణాటక బస్సు ప్రమాద ఘటన బాధాకరం. కుటుంబాలతో కలిసి విహర యాత్రకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన ప్రమాదం అందరినీ కలచివేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షలు.. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తమ వారి కళ్ల ముందే బస్సు కాలిపోవడం హృదయ విదారకరమని అన్నారు.

 

Tags: Karnataka bus accident

Leave A Reply

Your email address will not be published.