అక్టోబ‌ర్ 26న వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు విడుద‌ల‌.. 

Karnataka Cabinet expansion on 10th

Karnataka Cabinet expansion on 10th

Date:05/10/2018
వీర‌భోగ వ‌సంత‌రాయులు అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. నారా రోహిత్, శ్రీయ‌స‌ర‌న్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతానికి విడుద‌ల తేదీ మాత్ర‌మే క‌న్ఫ‌ర్మ్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ట్రైల‌ర్ విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించనున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌నున్నారు.
ఈ మ‌ధ్యే విడుద‌లైన వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగుతున్న భిన్న‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్స్ కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది.
ఈ లుక్స్ సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేసింది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ హ్యాండిల్ చేస్తున్నాడు. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావు బెల్ల‌న వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు: నారా రోహిత్, సుధీర్ బాబు,శ్రీయ సరన్, శ్రీవిష్ణు.
Tags:Karnataka Cabinet expansion on 10th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *