బుధవారం కర్నాటక కేబినెట్‌ విస్తరణ

Date:12/01/2021

బెంగళూరు  ముచ్చట్లు:

కర్నాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్ప బుధవారం కేబినెట్‌ను విస్తరించనున్నారు. కొత్త మంత్రులతో సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం వరకు కొత్త మంత్రుల జాబితా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సీఎం యడ్యూరప్ప ధ్రువీకరించారు. అయితే ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రులను ఎవరినైనా తొలగిస్తున్నారా? అడిగినప్పుడు.. యడ్యూరప్ప ‘మీడియాకే తెలుస్తుంది’ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా 27 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఏడు మంత్రుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యడ్యూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మూడోసారి. ఆగస్టు 2019లో 17 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయగా.. ఫిబ్రవరి, 2020లో మరో పది మందికి అవకాశం కల్పించారు. బుధవారం మరికొంత మందికి అవకాశం కల్పించనున్నారు. ఇందులో మూడు కొత్త ముఖాలను కేబినెట్‌కు పరిచయం చేయనున్నారు. ఎన్‌ మునిరత్న, ఎంబీటీ నాగరాజ్‌, ఆర్‌ శంకర్‌లను మంత్రివర్గంలోకి చేర్చుకునున్నారు. అలాగే మరో నాలుగు పదవులకు సీనియర్‌ నేతల పేర్లను పరిశీలిస్తున్నారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Karnataka Cabinet expansion on Wednesday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *