Natyam ad

కర్నాటకసీఎంసిద్దరామయ్యకురూ.10వేలుజరిమాన

బెంగళూరు ముచ్చట్లు:

 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు ఆ రాష్ర్ట హైకోర్టు లో నిరాశ ఎదురైంది. 2022లో తనపై నమోదైన ఓ కేసును కొట్టియాలని అభ్యర్థిస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.  రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ నమోదైన కేసులో సీఎం సిద్ధరామయ్యకు రూ.10వేలు జరిమానా విధించింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలాతో పాటు మంత్రులు ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డి ఉన్నారు. అలాగే, మార్చి 6న ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది.గత భాజపా ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన గ్రామంలో పనులకు 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ సంతోష్‌ పాటిల్‌ అనే కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది.  ఇందులోభాగంగా నాటి సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసాన్ని ముట్టడించేందుకు సిద్ధరామయ్యతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు మార్చ్‌ చేపట్టగా.. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు  అసౌకర్యం కలిగించారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలన్న సీఎం సిద్ధరామయ్య అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు  ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాలని సూచించింది.

 

Post Midle

Tags: Karnataka CM Siddaramaiah 10 thousand

Post Midle