Natyam ad

రేపు కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారం..

కర్ణాటక ముచ్చట్లు:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ తరుణంలో బెంగుళూరు చేరుకుంటున్నారు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్, సూర్జేవాల ల సమక్షం లో సీఎల్పీ సమావేశం జరుగనుంది. చెయ్యి ఎత్తే విధానం ద్వారా సీఎల్పీ నేత ఎంపిక ఓటింగ్ ఉంటుంది.సీఎల్పీ నేత ఎంపిక తర్వాత రాజ్ భవన్ కి కలసికట్టుగా గవర్నర్ గెహ్లాట్ తో భేటి కానున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు కు సిద్దమంటూ లేఖ ఇవ్వనున్నారు సీఎల్పీ నేత. రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమం.. తర్వాత క్యాబినెట్ ఏర్పాటు జరుగనుంది. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు స్కీమ్ అమలుపై తొలి సంతకం చేయనుంది కాంగ్రెస్‌ కొత్త సర్కార్‌. అయితే. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య హోం మంత్రి గా డీకే శివ కుమార్‌ ఉండనున్నట్లు సమాచారం.

 

Post Midle

Tags; Karnataka CM to take oath tomorrow

Post Midle