కర్నాటక సీఎం యడ్డి మూడు రోజులకే ఔట్‌

Karnataka CM Yaddu is out for three days

Karnataka CM Yaddu is out for three days

– సుప్రీం ఉత్తర్వులతో బలనిరూపణకి ముందే రాజీనామ
– కర్నాటక సీఎంగా కుమారస్వామి
– మారుతున్న రాజకీయాలపై కన్నడిగుల ఉత్కంఠిత

Date:19/05/2018

బెంగళూరు ముచ్చట్లు:

కర్నాటకలో రాజకీయం రోజురోజుకు మలుపులు తిరిగింది. మూడు రోజుల ముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి నాయకుడు యడ్యూరప్ప అసెంబ్లిలో బలనిరూపణకు ముందే ఓటమిని అంగీకరించి, గవర్నర్‌కు రాజీనామ సమర్పించారు. గత్యంతరం లేని గవర్నర్‌ జెడిఎస్‌తో కూటమిగా మారిన కాంగ్రెస్‌ వర్గాలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు రంగం సిద్దమైంది. జెడిఎస్‌ నాయకుడు, మాజీ ప్రధాని దేవేగౌడ రెండవ కుమారుడైన కుమారస్వామి కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. బిజెపి అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి, అసెంబ్లిలో బలం లేకపోయినా యడ్యూరప్ప చేత గవర్నర్‌ వాజుభాయ్‌వాలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో బిజెపి నేతలకు మూడు నాళ్ల సంతోషం విషాదంగా మారింది. కర్నాటక రాజకీయాలలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో సుస్థిరమైన నూతన ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ , జెడిఎస్‌లు ఏర్పాటు చేస్తాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధి అధ్యక్షతన పార్టీ బలోపేతం అవుతుందని, కన్నడ ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం తమకేంతో అదృష్టదాయకమని మాజీ ముఖ్యమంత్రి గులామ్‌నబి ఆజాద్‌ స్పష్టం చేశారు. కాగా కుమారస్వామి ఇంటి ముందు నేతల కోలాహలంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు కార్యక్రమాలు చేపట్టేందుకు నిమగ్నమైయ్యారు.

 

Tags: Karnataka CM Yaddu is out for three days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *