కర్నాటక మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ రాంమోహన్
రాయదుర్గం లో భారీస్థాయిలో కర్నాటక మద్యం పట్టివేత
రాయదుర్గం  ముచ్చట్లు:
కర్నాటక నుండి అక్రమ మద్యం రవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ రాంమోహన్ అన్నారు. ఈ మేరకు రాయదుర్గం ఎస్ఈబి పోలీసులు ఆద్వర్యంలో గుమ్మగట్ట మండలంలోని బూపసముద్రం వద్ద భారీస్థాయిలో దాచిన కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం పట్టణంలోని స్థానిక ఎస్ఈబి స్టేషన్ లో తెలిపారు.   భూపసముద్రం సమీపంలో ఓ వ్యవసాయ పొలంలోని రేకులషెడ్డులో   దాచివుంచారన్న పక్కా సమాచారంతో తమ సిబ్బంది సిఐ లు నాగేంద్ర ప్రసాద్, హిమబిందు ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడులలో గొల్ల చిత్తయ్య గొల్ల సుధాకర్ లను అరెస్టు చేసి 5280 మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై ఎక్సైజ్ యాక్ట్ మేరకు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. జిల్లాలో మద్యం ఇసుక అక్రమ రవాణా పై గట్టి నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గత ఒక నెలలోనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 34 లారీలను సీజ్ చేసి 10 లక్షల 80 వేలు జరిమానాలు వసూలు చేశామన్నారు.  కర్నాటక మద్యం తరలిస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాయదుర్గం ఎస్ఈబి ఇన్స్పెక్టర్ హిమబిందు, నాగేంద్ర ప్రసాద్, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Karnataka Liquor and sand smuggling austerity measures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *