Karnataka liquor seizure: One arrested

కర్ణాటక మద్యం స్వాధీనం: ఒకరి అరెస్టు

Date:07/08/2020

రామసముద్రం ముచ్చట్లు:

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లోని ఆల్చేపల్లి చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా కర్ణాటక మధ్యం తరలిస్తున్న పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ, గుండ్లపల్లి కు చెందిన వెంకట్రమణ కుమారుడు జివి సురేష్ బాబు (20) అనే వ్యక్తి టాటా ఎసి వాహనంలో మద్యం తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్దనుండి15 కేసులు టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మద్యం రూ ..50.525 రూపాయలు విలువ చేస్తుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.

ఆగ‌స్టు 9న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tags: Karnataka liquor seizure: One arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *