చిన్నమ్మకు కర్ణాటక రాజ్యసభ…

Karnataka's Rajya Sabha ...

Karnataka's Rajya Sabha ...

Date:27/02/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
తెలంగాణ చిన్నమ్మ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్. ఏపీ చిన్నమ్మ అంటే గుర్తుకు వచ్చే పేరు పురందేశ్వరి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మార్నింగ్ ఫ్లైట్ కు వైజాగ్ వచ్చి ఈవినింగ్ ఫ్లైట్ కు తిరిగి వెళ్లే నాయకురాలు ఆమె ఒక్కరే అంటారు. ఈ లోపే పనులన్నీ చక్కదిద్దుకునే వారనే చర్చ సాగుతుండేది. అదంతా గతం. కాలం మారింది. కాంగ్రెస్ ను ఏపీలో పాతాళానికి తొక్కేశారు ప్రజలు. ఫలితంగా ఆమె బీజేపీని నమ్ముకుంది. రాజంపేట నుంచి పోటీ చేసినా పరాజయం తప్పలేదు. అప్పటికప్పుడు కడప జిల్లాలో సీటు ఇవ్వడం ఒక ఎత్తయితే ఏ మాత్రం తనకు పరిచయం లేని చోట గెలిచేందుకు పావులు కదపడం ఓటమికి దారి తీసింది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందేశ్వరికి బీజేపీలో ప్రాధాన్యత ఇస్తే ఆ మేరకు ఏపీలో పుంజుకునే అవకాశం ఉంటుందని ఆమె బలంగా నమ్ముతోంది. అందుకే పురందేశ్వరికి సీటు ఇచ్చే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీలో బలమైన నేతగా అధిష్ఠానం అంచనాలున్న నేతల్లో ఆమె ఒకరు. జాతీయ రాజకీయాల్లోకి ఆమె సేవలను వినియోగించుకునే ఆలోచన చేస్తోంది హైకమాండ్. అందుకే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పురందేశ్వరిని కేంద్ర మంత్రి వర్గంలో చేర్చుకునే ఆలోచన ఉందట. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే వారిలో పురందేశ్వరి ఒకరు. అందుకే ఆమెకు ప్రయార్టీ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలోని 16 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకకు సీట్లున్నాయి. వాటిలో ఒక స్థానం పురందేశ్వరికి కేటాయించినట్లు సమాచారం. ఏపీలో ఆమె లోక్ సభకు పోటీ చేయడానికి సరైన నియోజకవర్గం లేదని భావించడం వల్లనే ఈ పని చేస్తున్నారట. చంద్రబాబుతో పొత్తు ఉన్నా టీడీపీ నుంచి ఆమెకు సహాయ నిరాకరణ ఉంటుందని అందుకే పెద్దల సభకు పంపాలని ఆలోచిస్తున్నారంటున్నారు. ఏపీలో పార్టీని బలోపేతానికి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి. టీడీపీ ఒకవేళ బీజేపీతో తెంచుకుంటే పురందేశ్వరి వంటి నేతను బరిలోకి దింపనున్నారు. ఆమెను కేంద్రంలో మంత్రిని చేస్తే ఏపీలో బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ దిశగా ఇప్పుడు కమలదళం అంచనాలు వేస్తోంది. టీఆర్ ఎస్లో జరుగుతున్న సంభాషణలివి. నల్గోండ టు అదిలాబాద్, పరకాల నుంచి పాలమూరు వరకూ ఇదే చర్చ. 2019 ఎన్నికల్లో ఎట్టాగైనా అధికారం నిలుపుకోవాలని టీఆర్ ఎస్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కలిసొచ్చే వారితో పవర్ లక్ష్యంగా పావులు కదుపుతుంది. ప్రభుత్వ వ్యతిరకతను అవకాశం చేసుకుని సత్తా చాటాలని ఉవ్విళూరుతోంది. ఇటువంటి సమయంలో కేసీఆర్.. ముందస్తు వ్యూహాలకు పదను పెడుతున్నారు. దానిలో భాగంగానే తన వ్యక్తిగత నిఘావర్గాలతో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, నేతల బలహీనతలు.. ప్రజల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల  ఇంటర్నేషనల్ స్థాయిలో వున్న సంస్థతో సర్వే చేయించినట్లు విషయం బయటకు పొక్కింది. వీరిలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు ఆయా నియజకవర్గాల్లో వ్యతిరేక గాలి వీస్తున్నట్లు నిర్దరణకు వచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బహిర్గతం చేయటం ద్వారా.. సొంత నేతలు దూరమయ్యే ప్రమాదం ఉందని భావించిన అధినేత కేసీఆర్.. నెమ్మదిగా ఆయా నియోజకవర్గాల్లో సెకండ్ కేడర్ నేతలను ఎంకరేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. విషయం కాస్త బయటకు పొక్కటంతో నేతల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ వద్ద వున్న జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయనేది తెలుసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారట. అధికారం పక్కా అనేది గులాబీ నేతల్లో బలంగా వున్న అభిప్రాయం. అటువంటిది.. పవర్ చేతికి వచ్చే వేళ సీటు దూరమైతే ఎలా అనేది సీనియర్ల ఆవేదన. వలస వచ్చిన నేతలకే అవకాశం ఇస్తారనే ప్రచారం సొంత నేతల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కొందరు మంత్రులు దీనిపై బహిరంగంగానే ఆవేదన వెలిబుచ్చారు. మరో విశేషమేమిటంటే.. కేబినెట్లో కీలకం అనుకుంటున్న మంత్రులు కూడా ఈ జాబితో ఉండటమే.
Tags: Karnataka’s Rajya Sabha …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *