Natyam ad

 గులాబీ అభ్యర్ధిగా కర్నె

హైదరాబాద్ ముచ్చట్లు:


మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభ్యర్థిగా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు పేర్లు పరిశీలించిన గులాబీ అధినేత కేసీఆర్ … నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేల్లో కర్నెకు సానుకూలంగా వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఎన్నికలు వచ్చినా కేసీఆర్ మాత్రం చివరి వరకు అభ్యర్థులను ప్రకటించరు. ఎన్నికల నామినేషన్లకు ఒకరోజు ముందు.. లేకుంటే అదే రోజూ అభ్యర్థిని ప్రకటించి భీఫాం అందజేస్తారు. అయితే ఆయన మదిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది మాత్రం చివరి వరకు గోప్యత పాటిస్తారు. గులాబీ పార్టీలో మాత్రం ఆశావాహులు పదుల సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల వరకు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తుంది. పార్టీపై, మునుగోడు నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలపై సర్వే చేస్తుంది. ఎన్నికలకు గడువు సైతం ఉండటంతో సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలపై సైతం నిర్వహిస్తుంది. బలబలాలను తెలుసుకుంటుంది. టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు,

 

 

 

 

మాజీ ఎమ్మెల్సీలతో పాటు నేతలకు ప్రజల్లో ఎవరికి సానుకూలత ఉందనే వివరాలను పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఆ సర్వేల్లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు అనుకూలంగా వచ్చిందని, ఆయనకే ఉప ఎన్నికల్లో టికెట్ దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు పలువురు టికెట్ ను ఆశిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి కలువడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018లో పోటీ చేసిన ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ నారబోయిన రవితో పాటు పలువురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.మునుగోడులో ఇప్పటికే పీకే టీం పలు దఫాలు సర్వే చేసింది.

 

 

 

Post Midle

పార్టీకి, నేతలపై ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రతిపక్షాల బలాలు, బలహీనతలను నివేదిక రూపంలో అందజేసింది. మరోమారు సర్వే నిర్వహిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి 2018లో విజయం సాధించారు. అయినప్పటికీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అది టీఆర్ఎస్ కు కలిసివచ్చే అంశమనిపార్టీ భావిస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు ధీటుగా ఎవరిని బరిలో నిలపాలనేదానిపై కసరత్తు చేస్తుంది. కర్నె ప్రభాకర్ 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పొలిట్ బ్యూరోగా పనిచేస్తున్నారు. 2014లో ఎమ్మెల్సీగా నియామకం అయ్యారు. ఆయనకు నియోజకవర్గంలోని పద్మశాలీలతో పాటు బీసీ వర్గాలు, ప్రజాప్రతినిధులు సైతం సానుకూలంగా ఉన్నారని, టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. ఆయనవైపు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొగ్గచూపుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ చివరకు అధినేత ఆశిస్సులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో వేచిచూడాల్సిందే.

 

Tags: Karne as the rose candidate

Post Midle